Weather Forecast: ఏపీలో అయిదు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింతగా బలపడనున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది .

Weather Forecast: ఏపీలో అయిదు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింతగా బలపడనున్న అల్పపీడనం
Weather Forecast (photo-ANI)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . ఫలితంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. అల్పపీడనం నేపథ్యంలో రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

నేను, విజయసాయి రెడ్డి వస్తాం, నీవు చెప్పేవి నిజాలే అయితే కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ముందా, సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన కాకాణి గోవర్థన్ రెడ్డి

కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు... కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

(The above story first appeared on LatestLY on Dec 11, 2024 03:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).