Uttar Pradesh Shocker: షాపింగ్ మాల్‌లో బట్టలు మార్చుకుంటుండగా మహిళపై అత్యాచారం, పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించి రేప్ చేసిన సెక్యూరిటీ గార్డు, బయట చెప్తే నీ భర్తను ఖతం అంటూ వార్నింగ్
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని మొరాదాబాద్‌లో (Moradabad) ఈ సంఘటన జరిగింది. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంత్ రోడ్‌లో ఉన్న పీవీఆర్ మాల్‌లో ఒక మహిళ హౌస్ కీపింగ్ పని చేస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఆ మహిళ విధుల అనంతరం ఆ మాల్‌లోని గదిలో దుస్తులు మార్చుకుంటున్నది.
Moradabad, April 01: ఒక మాల్‌లో పని చేసే ఒక సెక్యూరిటీ గార్డు (Security Guard) దారుణానికి పాల్పడ్డాడు. అందులో క్లీనింగ్ పని చేసే మహిళ దుస్తులు మార్చుకుంటుండగా ఆ గదిలోకి వెళ్లి గన్‌తో బెదిరించి లైంగిక దాడికి (Raped) పాల్పడ్డాడు. మరో ఇద్దరు వ్యక్తులు దీనికి సహకరించారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని మొరాదాబాద్‌లో (Moradabad) ఈ సంఘటన జరిగింది. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంత్ రోడ్‌లో ఉన్న పీవీఆర్ మాల్‌లో ఒక మహిళ హౌస్ కీపింగ్ పని చేస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఆ మహిళ విధుల అనంతరం ఆ మాల్‌లోని గదిలో దుస్తులు మార్చుకుంటున్నది. అయితే అక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డు బలవంతంగా డ్రెస్ చేంజ్ రూమ్‌లోకి ప్రవేశించాడు. అతడి వద్ద ఉన్న తుపాకీతో ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె భర్తను చంపుతానని అతడు బెదిరించాడు.
మాల్ సూపర్‌వైజర్, హౌస్ కీపింగ్ వ్యక్తి ఆ సమయంలో ఆ గది బయట కాపాలాగా ఉండి నిందితుడికి అండగా ఉన్నారు. కాగా, ఈ సంఘటన అనంతరం బాధిత మహిళ ఆ మాల్‌లో పని మానేసింది. కొన్ని రోజులుగా ఆమె మౌనంగా ఉండటంతో ఏం జరిగిందన్న దానిపై భర్త ఆరా తీశాడు. తన భార్యపై లైంగిక దాడి జరిగిందని తెలియడంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు.
దీంతో నిందితుడైన సెక్యూరిటీ గార్డుతోపాటు అతడికి సహకరించిన మాల్ సూపర్‌వైజర్, హౌస్ కీపింగ్ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీస్ అధికారి తెలిపారు.
(The above story first appeared on LatestLY on Apr 01, 2023 08:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

