Representational Image | (Photo Credits: IANS)

Lucknow, Mar 31: ఒక షాకింగ్ సంఘటనలో, 15 ఏళ్ల బాలిక, అబ్బాయిలతో మాట్లాడనివ్వలేదని తన తల్లిదండ్రులను చంపింది. ఈ సంఘటన మార్చి 14, 15 మధ్య రాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగింది. దాదాపు 15 రోజుల తర్వాత 15 ఏళ్ల బాలికను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు ఎనిమిదో తరగతి విద్యార్థినిగా గుర్తించారు. మగపిల్లలతో సంభాషించడానికి తల్లిదండ్రులు అనుమతించకపోవడంతో పాటు గత కొన్ని రోజులుగా పాఠశాలకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో బాలిక మనస్తాపానికి గురైంది.ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టింది.

ఈ సారి బెంగుళూరులో, కదులుతున్న కారులో రాత్రంతా యువతిపై సామూహిక అత్యాచారం, ఆస్పత్రిలో చావు బతుకుల్లో యువతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 47 ఏళ్ల షబ్బీర్, 44 ఏళ్ల రెహానా దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె అయిన 15 ఏళ్ల బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్నది. తల్లిదండ్రులు తనను అబ్బాయిలతో మాట్లాడనీయకపోవడంపై ఆమె గుర్రుగా ఉంది. అలాగే కొన్ని రోజులుగా స్కూల్‌కు కూడా తనను పంపకపోవడంపై ఆ బాలిక కలత చెందింది. దీంతో తల్లిదండ్రులను హత్య చేయాలని ప్లాన్‌ చేసింది. మెడికల్‌ షాప్‌లో పని చేసే ఒక యువకుడి నుంచి నిద్రమాత్రలు తెప్పించుకుంది.

ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్, అర్థరాత్రి నిద్రపోతుండగా బెడ్ షీట్లపై పడిన రవ్వలు, ఒక్కసారిగా ఎగసిన మంటలు

ఈ నెల 14న సాయంత్రం టీలో నిద్రమాత్రలు కలిపి తల్లిదండ్రులకు ఇచ్చింది. అర్ధరాత్రి తర్వాత ఆరు బయట మంచాలపై నిద్ర మత్తులో ఉన్న వారిద్దరి తలలపై గొడ్డలితో దాడి చేసింది. వారి ముఖాలపై దుప్పటి కప్పింది. అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటికి బయట నుంచి తాళం వేసింది. తాళం చేతులను తండ్రి దిండు కింద ఉంచింది. ఆ తర్వాత పొరుగింటి టెర్రస్ మీదుగా వెనుక నుంచి ఇంట్లోకి వెళ్లి నిద్రపోయింది.

కాన్పూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో మాడి మసైన 500 దుకాణాలు, దాదాపు రూ. 100 కోట్ల విలువైన వస్తువులు, నగదు అగ్నికి ఆహుతి

ఇంటి బయట పడుకున్న షబ్బీర్, రెహానా రక్తం మడుగుల్లో ఉండటాన్ని స్థానికులు మరునాడు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించారు. రెహానా అప్పటికే చనిపోగా, ఆసుపత్రికి తరలించిన తర్వాత షబ్బీర్‌ మరణించాడు. వారి ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండటం, దిండు కింద తాళం చెవి ఉండటంతో ఆ దంపతులను బయటి వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.

షబ్బీర్‌, రెహానా హత్యలపై ప్రాథమిక దర్యాప్తులో భాగంగా 16 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ దంపతుల పిల్లలను కూడా విచారించారు. ఈ సందర్భంగా మెడికల్‌ షాప్‌లో పని చేసే వ్యక్తితో నిద్ర మాత్రల గురించి పెద్ద కుమార్తె మాట్లాడిన ఆడియో క్లిప్‌ను ఆమె మొబైల్‌ ఫోన్‌లో పోలీసులు గుర్తించారు. ఆ బాలికపై అనుమానం వ్యక్తం చేసి లోతుగా ప్రశ్నించారు. దీంతో తల్లిదండ్రులకు నిద్ర మాత్రలు ఇచ్చి మత్తులో ఉన్న వారి తలలపై గొడ్డలితో పలుసార్లు బాది హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది.

ఈ నేపథ్యంలో నేరం జరిగిన 15 రోజుల తర్వాత దంపతుల హత్య గుట్టు వీడింది. ఆ బాలికను అరెస్ట్‌ చేసి జువెనైల్ హోమ్‌కు తరలించారు. ఆమెకు నిద్ర మాత్రలు సరఫరా చేసిన 22 ఏళ్ల మహ్మద్ అకీల్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.