దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శాస్త్రి పార్క్‌ (Shastri Park) ఏరియాలోని దోమల నుంచి రక్షణ కోసం ముట్టించిన దోమలబత్తితే మంటలు వ్యాపించాయి. దోమలబత్తీ నుంచి వచ్చిన నిప్పు మిరుగులు బెడ్‌షీట్‌లపై పడి ఇళ్లంతా పొగలు వ్యాపించాయి. దాంతో ఊపిరాడక కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు పడుకున్న చోటే మరణించారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

శాస్త్రిపార్క్‌ ఏరియాలో దోమలబత్తీ అంటుకుని పొగులు కమ్మడంతో ఒకే కుటుంబానికి చెందని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, వాళ్లలో ఒక చిన్నారి ఉందని నార్త్‌ ఈస్ట్‌ డిస్ట్రిక్ట్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ సంధ్యాస్వామి (Additional CP Sandhya Swamy) తెలిపారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఆమె వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)