Wrestlers Protest: కొత్త మలుపు తిరిగిన బ్రిజ్ భూషణ్ కేసు, మైనర్‌ను వేధించినట్లు ఆధారాలు లేవని తెలిపిన ఢిల్లీ పోలీసులు, ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని రిపోర్టు
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు కొత్త మలుపు తిరిగింది. మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు బ్రిజ్ భూషణ్‌పై స్టార్ రెజ్లర్లు ఆరోపిస్తూ.. ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు మైనర్‌ను బ్రిజ్ వేధించినట్లు ఆధారాలు లేవని తమ ఛార్జిషీట్‌లో తెలిపారు.
- Read in
- తెలుగు
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు కొత్త మలుపు తిరిగింది. మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు బ్రిజ్ భూషణ్‌పై స్టార్ రెజ్లర్లు ఆరోపిస్తూ.. ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు మైనర్‌ను బ్రిజ్ వేధించినట్లు ఆధారాలు లేవని తమ ఛార్జిషీట్‌లో తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు రిపోర్టు ఇచ్చారు. బ్రిజ్‌పై మైనర్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని పోలీసులు తమ రిపోర్టులో కోరారు.
మైనర్ కేసు విషయంలో పోలీసులు సుమారు 500 పేజీల నివేదికను పొందుపరిచారు. విచారణలో తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మైనర్ కేసు విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 173 కింద రిపోర్టును రూపొందించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.. బాధిత మైనర్ తో పాటు ఆమె తండ్రి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, మైనర్ కేసు విషయంలో జులై 4న కోర్టు విచారణ జరగనుంది.
PTI Video
VIDEO | Delhi Police team reaches Patiala House Court to file status report in the case involving WFI President Brij Bhushan Sharan Singh, who has been accused of sexual harassment by women wrestlers. Meanwhile, another team of Delhi Police is said to have filed the charge sheet… pic.twitter.com/1dan6uSMB5
— Press Trust of India (@PTI_News) June 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 15, 2023 02:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

