Kodali Nani Slams Chandrababu: వీడియో ఇదిగో, నువ్వు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడివేనా? చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్, ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించావో చెప్పాలంటూ డిమాండ్

తిరుపతి లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దీనిపై కొడాలినాని, తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్‌25) మీడియాతో మాట్లాడారు. అసలు చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా అని కొడాలి నాని ప్రశ్నించారు. స్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారు.

Kodali Nani Slams Chandrababu: వీడియో ఇదిగో, నువ్వు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడివేనా? చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్, ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించావో చెప్పాలంటూ డిమాండ్
Chandrababu and Kodali Nani (Photo/X)

తిరుపతి లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దీనిపై కొడాలినాని, తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్‌25) మీడియాతో మాట్లాడారు. అసలు చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా అని కొడాలి నాని ప్రశ్నించారు.

స్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారు. అపవిత్రమైన లడ్డూలను భక్తులు తిన్నారని చంద్రబాబు అన్నారు.జగన్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేశారు.చంద్రబాబుకు బుద్ది రావాలని వెంకటేశ్వర స్వామి ని కోరుకుంటున్నాం.వెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబు.ఏ ల్యాబ్ కూడా కల్తీలు జరిగినట్టు రిపోర్టు ఇవ్వలేదు.

చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా ? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు, ఆయన పాపాలు కడిగేందుకే పూజలు చేస్తున్నామని పేర్ని నాని ప్రకటన

కల్తీ జరిగే అవకాశం ఉందని మాత్రమే చెప్పాయి.దాన్ని పట్టుకుని చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడేనా?.నిజమైన భక్తుడే ఐతే ఎన్నిసార్లు తలీలాలు అర్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Here's Video

సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా జగన్ లేఖ రాశారు.విచారణ జరపాలని కోరాం.సిట్ అంటే కూర్చునే, స్టాండ్ అంటే నిలపడే అధికారులతో సిట్ వేస్తే ఏం లాభం?.టీడీపీ ఆఫీసులో లోకేష్ చెప్పినట్టు రిపోర్ట్ రాసే వారు ఇంకేం విచారణ చేస్తారు?చంద్రబాబు చేసిన పాపానికి  ఆయనకే శిక్ష వేయాలి.రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజల కార్యక్రమానికి పిలుపునిస్తున్నామన్నారు కొడాలి నాని

(The above story first appeared on LatestLY on Sep 25, 2024 05:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).