BJP Second Candidate List for Lok Sabha Elections 2024 Out: రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌లకు 72 మంది అభ్య‌ర్ధుల‌తో బీజేపీ రెండో జాబితాను బుధ‌వారం ప్ర‌క‌టించింది. రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రీ, పీయూష్ గోయ‌ల్‌, హ‌రియాణా మాజీ సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ల‌కు చోటు ద‌క్కింది. ఇప్పటికే తొలి జాబితాను బీజేపీ విడుదల చేసిన సంగతి విదితమే. ఇందులో మొత్తం 195 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. మళ్లీ మోదీకే పట్టం కట్టనున్న ఓటర్లు, న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైన సంచలన విషయాలు ఇవిగో..

వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బ‌రిలో దిగ‌నుండ‌గా, గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ, కాంతీ నుంచి సువేందు అధికారి, ఫతేపూర్ నుంచి సాథ్వీ నిరంజన్ జ్యోతి, మధుర నుంచి హేమా మాలిని లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్నారు. తొలి జాబితాలో 34 మంది మంత్రులు, స్పీకర్, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మొదటి జాబితాలో 28 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారు. షెడ్యూల్ కులాల నుంచి 27, గిరిజనుల నుంచి 18, ఓబీసీల నుంచి 57 మందికి టికెట్లు ఇచ్చారు. తొలి జాబితాలో 34 మంది మంత్రులు, స్పీకర్, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు.

Here's list

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)