Manohar Joshi Passes away: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత.. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలు
మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన ముంబయిలోని పీడీ హిందుజా హాస్పిటల్ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Hyderabad, Feb 23: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి (86) (Maharastra Ex CM Manohar Joshi) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుకు (Heart Attack) గురైన ఆయన ముంబయిలోని పీడీ హిందుజా హాస్పిటల్ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. జోషి ఆరోగ్య పరిస్థితి విషమించిందని గురువారం సాయంత్రమే రిపోర్టులు వెలువడ్డాయి. అంతలోనే ఆయన చనిపోయారంటూ ప్రకటన వెలువడింది.
Former Lok Sabha Speaker and former Maharashtra CM Manohar Joshi passes away at a Hospital in Mumbai after he suffered a cardiac arrest. pic.twitter.com/Wr36JDAflx
— DD News (@DDNewslive) February 23, 2024
సీఎంగా, లోక్‌సభ స్పీకర్ గా సేవలు..
మనోహర్ జోషి శివసేన పార్టీలో అగ్రస్థాయి నేతగా ఎదిగారు. అంచెలంచెలుగా ఎదిగి 1995 నుంచి 1999 మధ్యకాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో 2002-2004 కాలంలో లోక్‌సభ స్పీకర్ గానూ పనిచేశారు.
(The above story first appeared on LatestLY on Feb 23, 2024 09:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

