Lasya Nanditha Passes away (Credits: X)

Hyderabad, Feb 23: తెలంగాణ (Telangana) రాజకీయాల్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌ ‌పై ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె పీఏ ఆకాశ్‌ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత ఆమె కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana: ఈ నెల 27 నుంచి నూ. 500కే సిలిండర్, 200 యూనిట్లు లోపు కరెంట్ బిల్లు వస్తే జీరో బిల్లు, మరో రెండు గ్యారెంటీలు అమలుకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి సర్కారు

ఏడాది కిందటే

లాస్య నందిత ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బీఆర్ఎస్ కార్యానిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొన్ని రోజుల్లో మళ్లీ ఆమె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం విషాదంగా మారింది. ఇక దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. ఆయన చనిపోవడంతో బీఆర్ఎస్‌ పార్టీ లాస్య నందితకు సీటు ఇచ్చి పోటీ చేయించింది. సరిగ్గా ఏడాది కిందటే సాయన్న కూడా మృతి చెందడం గమనార్హం.

వెంటాడిన‌ ప్రమాదాలు

లాస్యకు ఈ ఏడాది కలిసిరాలేదనే చెప్పాలి. ఈ ఏడాది తొలినాళ్లలో లిఫ్టులో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి ఆమె బయటపడ్డారు. అనంతరం నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవసారి‌ ప్రమాదానికి గురై తృటిలో బయటపడ్డారు. అయితే, మూడవసారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక యువ‌ ఎమ్మెల్యే మృతిచెందారు. పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు కారు ప్రమాదాలు జరగ్గా.. ఈ రెండుసార్లు ఆ కారు డ్రైవర్ ఒకరే కావడం గమనార్హం.