తెలంగాణలో మరో రెండు గ్యారెంటీలు గృహలక్ష్మీ, రూ.500కే సిలిండర్‌ పథకాలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. అర్హులందరికీ లబ్ధి చేకూరాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. మార్చి నెల నుంచి 200 యూనిట్లు లోపు కరెంట్‌ వాడే వారికి జీరో బిల్లు వేయాలని ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అర్హుల ఖాతాలో వేయాలా లేక ఏజెన్సీకి ఇవ్వాలా అనేదానిపై అధికారులు ఈజీ ప్రాసెస్ చేయాలని సూచించారు. సబ్సిడీ నిధులు వెంట వెంటనే చెల్లించే విధానం ఏర్పాట్లు చేయాలన్నారు. రేషన్ కార్డు, లేక ఇతర కారణాల వల్ల పథకాలకు దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అవకాశం ఇస్తామని సీఎం పేర్కొన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)