Madhya Pradesh Bypolls: మధ్యప్రదేశ్ సర్కారు ఉంటుందా..ఊడుతుందా? సింధియా టీం మళ్లీ విజయం సాధిస్తుందా? ఎంపీలో 28 స్థానాలకు మొదలైన పోలింగ్, గెలుస్తామనే ధీమాతో ఉన్న కాంగ్రెస్
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల నడుమ మరోసారి హోరా హోరీ పోరు మొదలైంది. మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh Bypolls) 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు (Madhya Pradesh By-Elections 2020) జాతీయ స్థాయిలో తెగ ఆసక్తిగా మారాయి. కమల్‌నాథ్ సర్కార్‌ను (Kamal nath Govt) కూల్చి బీజేపీ గూటికి చేరిన 25 మంది ఎమ్మెల్యే రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మరో మూడు స్థానాలు కలుపుకుని మొత్తం 28 స్థానాలకు పోలింగ్ ఇదివరకే మొదలైంది.
Bhopal, Nov 3: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల నడుమ మరోసారి హోరా హోరీ పోరు మొదలైంది. మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh Bypolls) 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు (Madhya Pradesh By-Elections 2020) జాతీయ స్థాయిలో తెగ ఆసక్తిగా మారాయి. కమల్‌నాథ్ సర్కార్‌ను (Kamal nath Govt) కూల్చి బీజేపీ గూటికి చేరిన 25 మంది ఎమ్మెల్యే రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మరో మూడు స్థానాలు కలుపుకుని మొత్తం 28 స్థానాలకు పోలింగ్ ఇదివరకే మొదలైంది.
ఈ ఎన్నికను అధికార బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 28 స్థానాల్లో తొమ్మిదింటిలో గెలిస్తే శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన జ్యోతిరాధిత్య సింధియాకూ ఈ ఎన్నిక కీలకమైనది. ఆయన వర్గంగా భావిస్తున్న ఎమ్మెల్యేలంతా పోటీలో ఉండటంతో బీజేపీ నాయకత్వంలో వారి గెలుపు బాధ్యతను యువ నేతపై మోపింది.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన సింధియా ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలని కసితో రగిలిపోతున్నారు. అదే స్థాయిలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం సైతం జోరుగా నిర్వహించారు. మరోవైపు చేతిలో ఉన్న అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న 28 సీట్లు గెలిచినా మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క అడుగు దూరంలో ఆ పార్టీ నిలిచిపోతుంది. అయినప్పట్టికీ స్వతంత్రుల మద్దతులో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూలుస్తాయా? లేక సింధియాకు గెలుపును సాధించిపెడతాయా అనేది వేచి చూడాలి. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగారు.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్, కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా
ఇక 94 అసెంబ్లీ స్థానాలకు బిహార్‌లో రెండోదశ పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఈ స్థానాలు జేడీయూ, ఆర్జేడీకి ఎంతో ముఖ్యమైనవి. ఎన్డీయే తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు కేంద్రమంత్రులు సైతం ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు. జేడీయూ-బీజేపీ అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి రెండోదశ పోలింగ్ అత్యంత కీలమైనది. కూటమి తరుఫున తేజస్వీ అన్నీ తానై ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. ఇక 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఇప్పటికే తొలిదశ పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.
సంక్షోభంపై షాకిచ్చిన కమల్ నాథ్ సర్కార్
మరోవైపు గుజరాత్(8), కర్ణాటక(2), చత్తీస్‌గఢ్(1), ఉత్తర ప్రదేశ్(7), జార్ఖండ్(2), నాగాలాండ్(2), హరియాణా(1), ఒడిశా(2), తెలంగాణ (దుబ్బాక)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
(The above story first appeared on LatestLY on Nov 03, 2020 09:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

