Ponnam Meets KCR: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎందుకంటే??
తెలంగాణలో నేడు రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలవనున్నారు.
Hyderabad, Dec 7: తెలంగాణలో (Telangana) నేడు రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ సీఎం కేసీఆర్ (CM KCR) ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కలవనున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ఆయన్ని ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ సీఎంఓ కేసీఆర్ అపాయింట్ మెంట్ ను కోరింది. ఆయన కూడా సమ్మతించారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం కేసీఆర్ ను కలవనున్నారు.
కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్న మంత్రి పొన్నం
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానించనున్న మంత్రి
ప్రభుత్వం తరపున స్వయంగా ఆహ్వానించనున్న మంత్రి పొన్నం @KCRBRSPresident @Ponnam_INC #KCR… pic.twitter.com/EJTcKuXkS1
— BIG TV Breaking News (@bigtvtelugu) December 7, 2024
కేసీఆర్ హాజరుపై సస్పెన్స్
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, తెలంగాణ తల్లి గత విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహాన్ని తీసుకురావడం, విగ్రహం రూపురేఖలు మార్చడంపై బీఆర్ఎస్ నిరసనలు చేపడుతుంది. ఈ క్రమంలో పొన్నం ఆహ్వానం మేరకు కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా? అనేది సస్పెన్స్ గా మారింది.
(The above story first appeared on LatestLY on Dec 07, 2024 09:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

