Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Vijayawada, Dec 7: ఫెంగల్ తుఫాను ముప్పు తప్పిపోయినట్టు భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కు మరోసారి భారీ వర్షాల (Heavy Rains) ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.  దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి దుర్మ‌ర‌ణం.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

వర్షాలు ఎప్పుడంటే??

అల్పపీడన ప్రభావంతో 11, 12 తేదీల్లో తమిళనాడులో, 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాదు, అల్పపీడనం వాయుగుండంగానూ మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో హోంగార్డుల దినసరి భత్యం రూ.921 నుంచి రూ.1000కి పెంపు, శుభవార్తను అందించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం