Hyderabad, Dec 7: తెలంగాణలోని (Telangana) యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. భూదాన్ పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు చెరువులో మునగడంతో అందులో ఉన్న ఆరుగురు యువకుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు చెరువులోంచి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Here's Video:
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం
భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు
చెరువులో మునిగి ఐదుగురు యువకులు మృతి
హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ప్రమాదం
మృతులు హైదరాబాద్ LB నగర్ కు చెందిన వంశి (23), దిగ్నేశ్ (21),… pic.twitter.com/2e7IUJofnY
— BIG TV Breaking News (@bigtvtelugu) December 7, 2024
మృతులు హైదరాబాద్ వాసులు
హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులోనే ఈ దుర్ఘటన జరిగినట్టు అనుమానిస్తున్నారు. మృతులను హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఆర్టీసీ కాలనీకి చెందిన వినయ్, హర్ష, బాలు, దినేశ్, వంశీగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో బయటపడిన మణికంఠ యాదవ్ అనే యువకుడు కారు అద్దాలు పగులగొట్టుకొని బయటకు వచ్చినట్టు సమాచారం.
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ కార్యక్రమం