Mizoram Election Results 2023: మిజోరాం ఎన్నికల ఫలితాలు, అధికార పార్టీ ఎంఎన్‌ఎఫ్‌కు బిగ్ షాక్, అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించిన జడ్‌పీఎం, ఓడిపోయిన సీఎం జోరమతంగ
తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో జడ్‌పీఎం (జొరం పీపుల్స్ మూవ్‌మెంట్) పార్టీ అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ స్థానాలకు దక్కించుకుంది. ఇక ఆ రాష్ట్ర సీఎం(Mizoram Chief Minister) జోరమతంగ ఓటమి పాలయ్యారు. మీజో నేషనల్ ఫ్రంట్‌కు చెందిన ఆయన రెండు వేల ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు
రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ అనే నాలుగు రాష్ట్రాల ఫలితాలు ప్రకటించిన ఒక రోజు తర్వాత మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 40 నియోజక వర్గాలున్న మిజోరంలో అధికార ఎంఎన్‌ఎఫ్(మిజో నేషనల్ ఫ్రంట్), జడ్‌పీఎం (జొరం పీపుల్స్ మూవ్‌మెంట్), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో ఎంఎన్‌ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్ పోటీ చేయగా, బీజేపీ 23 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది.
మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ 26, జడ్‌పీఎం 8, కాంగ్రెస్ 5, బీజేపీ ఒక స్థానం గెలుపొందాయి.నవంబరు 7న మిజోరం అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు, గెలిచిన 119 అభ్యర్థుల పూర్తి జాబితా ఇదిగో..
తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో జడ్‌పీఎం (జొరం పీపుల్స్ మూవ్‌మెంట్) పార్టీ అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ స్థానాలకు దక్కించుకుంది. ఇక ఆ రాష్ట్ర సీఎం(Mizoram Chief Minister) జోరమతంగ ఓటమి పాలయ్యారు. మీజో నేషనల్ ఫ్రంట్‌కు చెందిన ఆయన రెండు వేల ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. ఐజ్వాల్ ఈస్ట్-1 స్థానం నుంచి పోటీ చేసిన జోరం పీపుల్స్ మూమెంట్(జెడ్‌పీఎం) అభ్యర్థి లాల్‌తన్ సంగ విజయం సాధించారు. లాల్‌తన్‌సంగకు 10727 ఓట్లు పోలవ్వగా, జోరమతంగకు 8626 ఓట్లు పోలయ్యాయి.
ఎన్నికల సంఘం ప్రకారం, మిజోరాం అసెంబ్లీలో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) మెజారిటీ సాధించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా 40 స్థానాలకు గాను 21 స్థానాల్లో విజయం సాధించి మరో ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిజో నేషనల్ ఫ్రంట్ 10 స్థానాల్లో విజయం సాధించగా మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భారీ ఓటమి తర్వాత మిజోరం సిఎం జోరంతంగా రాజీనామా చేయనున్నారు. మిజోరం సిఎం జోరంతంగా సాయంత్రం 4 గంటలకు గవర్నర్ హరిబాబు కంభంపాటిని కలవనున్నారు, రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
ZPM గెలిచిన స్థానాలు
కొలాసిబ్, చాల్ఫిల్, తావీ, ఐజ్వాల్ నార్త్-II, ఐజ్వాల్ వెస్ట్-I, ఐజ్వాల్ వెస్ట్-II, ఐజ్వాల్ వెస్ట్-III, ఐజ్వాల్ సౌత్-I, ఐజ్వాల్ సౌత్-III, లెంగ్‌టెంగ్, టుయిచాంగ్, ఛాంఫై నార్త్, టుయికుమ్, హ్రాంగ్‌టుర్జో , సౌత్ టుయిపుయ్, లుంగ్లీ వెస్ట్, లుంగ్లీ సౌత్, లాంగ్ట్లై ఈస్ట్.
(The above story first appeared on LatestLY on Dec 04, 2023 03:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

