Sonia Gandhi’s ‘Poor Thing’ Remark: రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ జమీందారీ మనస్తత్వం దానిని అంగీకరించదని బీజేపీ మండిపాటు, వీడియోలు ఇవిగో..

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా మీడియాతో మాట్లాడుతూ.. ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయారు’’ అంటూ బదులిచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ గాంధీ కూడా తల్లి వ్యాఖ్యలను (Sonia Gandhi’s ‘Poor Thing’ Remark) సమర్థించారు. దీనిపై వివాదం చెలరేగింది.

Sonia Gandhi’s ‘Poor Thing’ Remark: రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ జమీందారీ మనస్తత్వం దానిని అంగీకరించదని బీజేపీ మండిపాటు, వీడియోలు ఇవిగో..
Congress leader Sonia Gandhi (Photo Credits: PTI)

New Delhi, Jan 31: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ప్రసంగించారు. ఈ ప్రసంగంపై రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా మీడియాతో మాట్లాడుతూ.. ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయారు’’ అంటూ బదులిచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ గాంధీ కూడా తల్లి వ్యాఖ్యలను (Sonia Gandhi’s ‘Poor Thing’ Remark) సమర్థించారు. దీనిపై వివాదం చెలరేగింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, మహా కుంభమేళా తొక్కిసలాటపై దిగ్బ్రాంతి, గత ప్రభుత్వాల కంటే వేగంగా దేశంలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడి

సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వారు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ విమర్శించారు. ‘సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాయకులు రాష్ట్రపతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ద్రౌపది ముర్ము ఆదివాసీ కుటుంబానికి చెందినవారు. ఇప్పుడు ఆమె మన దేశంలో నంబర్ వన్ పౌరురాలు. కాంగ్రెస్ జమీందారీ మనస్తత్వం దానిని అంగీకరించదు. అందుకే వారు ఆమె ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నారు’ అని అన్నారు.

Sonia Gandhi’s ‘Poor Thing’ Remark: 

ఇక బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి మరియు భారతదేశంలోని గిరిజన సంఘాలకు కాంగ్రెస్ పార్టీ నిస్సందేహంగా క్షమాపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను" అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న విధానాలు, సాధించిన విజయాలపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే మూడు రెట్లు వేగంతో పనిచేస్తోందని, త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారనుందని తెలిపారు. ప్రసంగం ఆరంభంలో ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 05:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).