President Droupadi Murmu:పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, మహా కుంభమేళా తొక్కిసలాటపై దిగ్బ్రాంతి, గత ప్రభుత్వాల కంటే వేగంగా దేశంలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడి

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu).

President Droupadi Murmu:పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, మహా కుంభమేళా తొక్కిసలాటపై దిగ్బ్రాంతి, గత ప్రభుత్వాల కంటే వేగంగా దేశంలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడి
President Droupadi Murmu address the both houses of Parliament(X)

Deli, Jan 31:  పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu). దేశంలో గత ప్రభుత్వాల కంటే వేగంగా దేశంలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Stampede)లో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ముర్ము.. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు అని వెల్లడించారు.

ప్రపంచం నలుమూలల నుండి కుంభమేళాకు భక్తులు తరలివస్తున్నారని ఇది మన సంస్కృతి, సంప్రదాయానికి నిదర్శనం అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతేడాది డిసెంబర్ 26న మరణించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Murmu) ఆయనకు నివాళులర్పించారు.  కేరళలోనూ కవిత లిక్కర్ స్కాం.. అసెంబ్లీలో కల్వకుంట్ల కవితపై ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు, కేరళలోనూ లిక్కర్ స్కాం జరిగిందని అసెంబ్లీలో ఫైర్ 

భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుందని తెలిపిన ముర్ము.. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తామని చెప్పారు.

President Droupadi Murmu address the both houses of Parliament

ఇక శనివారం(రేపు) కేంద్ర బడ్జెట్​ను ప్రవేశ పెట్టనున్నారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్‌. ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ జరగనున్నాయి. తొలి విడత ఫిబ్రవరి 13వ తేదీ వరకూ, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరగనుండగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు నిర్మల సీతారామన్.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).