Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి.
సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మన ఇళ్లల్లో ఉంటే డబ్బుకు కొరత ఉండదు. డబ్బు ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అయితే సంపదను ఇచ్చే లక్ష్మీదేవిని అనుగ్రహం చేసుకోవడానికి ప్రజలు అనేక రకాలైన పూజలు చేస్తారు.
సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మన ఇళ్లల్లో ఉంటే డబ్బుకు కొరత ఉండదు. డబ్బు ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అయితే సంపదను ఇచ్చే లక్ష్మీదేవిని అనుగ్రహం చేసుకోవడానికి ప్రజలు అనేక రకాలైన పూజలు చేస్తారు. దాని ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులు చేయాలి. మీ ఇంట్లో గనక ఇలా ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉండదు. దరిద్ర దేవత తిష్ట వేస్తుంది.
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి-శుభ్రంగా లేని ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇల్లును శుభ్రంగా ఉంచుకొని ఇంటిముందు ముగ్గు పెట్టుకొని ఉండాలి. ఇలా ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుంది.
గొడవలు పడకూడదు- తరచుగా ఇళ్లలో గొడవలు పెట్టుకుంటారు. కొట్లాటలు గొడవల వల్ల వారు మాట్లాడుకునే మాటలు స్థాయి మించి ఉంటాయి. దీని ద్వారా ఆ లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంట్లో ఉండదు. ఎవరింట్లో అయితే గొడవలు లేకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమతో కలిసి జీవిస్తారో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సంపదకు లోటు ఉండదు. ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు గొడవ పెట్టుకోకూడదు.
రాత్రి సమయాల్లో ఊడవడం- సూర్యాస్తమయం సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇల్లు ఊడవడం తోడవడం చేయకూడదు. దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం అసలే ఉండదు. ఇలాంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిర నివాసం చేయదు.
Astrology: సెప్టెంబర్ 23 సూర్యుడు, బుధుడు కన్యరాశిలోకి ప్రవేశం
పెద్దవాళ్లను అవమానించడం- ఇంట్లో కుటుంబ పెద్దలను, బ్రాహ్మణులను, స్త్రీలను అవమానించే ఇళ్లలో లక్ష్మీదేవి ఒక క్షణం కూడా ఉండదు.
వంటగది శుభ్రంగా ఉండాలి- రాత్రిపూట వంటగదిని ఎప్పుడు కూడా నీట్ గా ఉంచాలి. తిన్న ఎంగిలి గిన్నెలను అప్పుడే తోమేసేయాలి అలా ఉంచినట్లయితే లక్ష్మీదేవికి నచ్చదు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Sep 09, 2024 05:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

