Astrology: ఆగస్టు 22 నుండి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం..ఈ 5 రాశుల వారికి సంపద పెరుగుతుంది.

శ్రావణమాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఆగస్టు 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం దీనిద్వారా అన్నిరాశులకు కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి బుధుని అనుగ్రహంతో సిరిసంపదలు పెరుగుతాయి.

Astrology: ఆగస్టు 22 నుండి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం..ఈ 5 రాశుల వారికి సంపద పెరుగుతుంది.
astrology

శ్రావణమాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఆగస్టు 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం దీనిద్వారా అన్నిరాశులకు కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి బుధుని అనుగ్రహంతో సిరిసంపదలు పెరుగుతాయి. ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: బుధుడు కర్కాటక రాశిలోకి సంచరించడం వల్ల ఈ రాశి వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మీ కుటుంబంలో తండ్రి ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతుంది. చాలాకాలంగా యువత ఆందోళన గురవుతున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణలు అవుతారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూల సమయం నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

తులారాశి: ఈ రాశి వారికి బుధుని సంచారం చాలా శుభప్రదం. వ్యాపారవేత్తలకు డబ్బు సంపాదించడానికి అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. దీనివారు సద్వినియోగం చేసుకొని తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రాజకీయాల్లో సంబంధం ఉన్న వ్యక్తులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది.

Astrology: రాఖీ పౌర్ణమి తో పాటు యాదృచ్ఛికంగా ఈసారి రెండు యోగాల

మీనరాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కెరీర్ కి సంబంధించిన కోరికలు నెరవేరుతాయి. వ్యాపార భాగస్వామి సలహాలతో తీసుకున్న నిర్ణయం ప్రకారం భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ పెరుగుతుంది. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారు. విద్యార్థులకు భవిష్యత్తు బాగుంటుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. పై అధికారుల నుండి మీకు ఎటువంటి ఒత్తిడి ఉండదు. సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దీంతో భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి  బుధుడు సంచారం కారణంగా ఈ రాశి వారు ఉన్నత స్థానానికి వెళ్తారు. మీరు వ్యక్తిగత జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఇంట్లో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం. దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళ్తారు. కొత్త ప్రణాళికలతో పనిని ప్రారంభిస్తారు. అది విజయవంతంగా సాగుతుంది. భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు విదేశాల్లో పెట్టుబడులు పెడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.

(The above story first appeared on LatestLY on Aug 18, 2024 05:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).