Astrology: ఫిబ్రవరి 24 పౌర్ణమి నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరులు అవుతారు.

Astrology: ఫిబ్రవరి 24 పౌర్ణమి నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం కాబోతోంది. ఈ రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరులు అవుతారు.

Astrology: ఫిబ్రవరి 24 పౌర్ణమి నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరులు అవుతారు.
Image credit - Pixabay

వృషభం: ఈ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదమరిచి గుడ్డిగా ఎవరిని నమ్మి డబ్బు బాధ్యతలు అప్పగించకూడదు.  ఒకవేళ అలా చేసినట్లయితే మోసపోయే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. . అయితే వ్యాపారస్తులు మాత్రం ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగులతో  వాదనకు దిగకూడదు.  అలా చేసినట్లయితే  ఈ గొడవ  మీ కెరీర్ ను ప్రమాదం వైపు తీసుకెళ్లి అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించే అవకాశం ఉంది మంచి బిజినెస్ సాధిస్తారు. విదేశాల్లో  ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు శుభవార్త వినే అవకాశం ఉంది.  నిరుద్యోగులు తమ ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.పెళ్లి కాని యువతీ యువకులు తమ పెళ్లి ప్రయత్నాలను ఈ రోజు నుంచి ప్రారంభించవచ్చు.  ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి  సింధూరం ధరించి  11 ప్రదక్షిణలు చేసినట్లయితే  మీరు మొదలుపెట్టిన పనిలో విజయం సాధిస్తారు.

కర్కాటకం: ఈ రాశి వారు విదేశాలకు వెళ్లాలనుకునే వారు విజయం సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా వీసా ప్రయత్నాల్లో వీరి అడ్డంకులు అన్ని తొలగిపోతాయి.  వ్యాపారస్తులు ఒక మంచి శుభవార్త విని అవకాశం ఉంది.  చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవడంతో పాటు,  సంతానం విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.  పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారు  శుభవార్త వినే అవకాశం ఉంది.  వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.  విద్యార్థులు  పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  లేకపోతే మీ కెరీర్ దెబ్బ తినే అవకాశం ఉంది.  కూరగాయలు,  చికెన్,  పాలు పెరుగు అమ్ముకునే  వ్యాపారస్తులు  డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది.  ఆఫీసులో ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి ఆ గొడవ మీ కెరీర్ దెబ్బతీసే అవకాశం ఉంది.  వైద్య వృత్తిలో ఉన్నవారు  జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.  ప్రతి గురువారం  నవగ్రహాల్లోని గురు గ్రహం వద్ద   ఆవు నెయ్యితో దీపం వెలిగించి.  నవగ్రహాల చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

కన్య:  ఈ రాశి వారు విదేశాల్లో రాణించే అవకాశం ఉంది.  ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాపారం విషయంలో చక్కగా రాణిస్తారు.  కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి ఈ కాలం బాగా కలిసి వస్తుంది. . అంతేకాదు ఈ రాశి వారు  వైవాహిక జీవితంలో కూడా కొన్ని శుభ ఘడియలు రాబోతున్నాయి.  నూతన దంపతులు త్వరలోనే శుభవార్త వింటారు.  ఇల్లు కొనాలని ప్రయత్నించేవారు వారి ప్రయత్నాల్లో సఫలం అవుతారు.  వైద్య వృత్తిలో ఉన్నవారు ఆదాయం విషయంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది.  సంతానం విషయంలో ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.  పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవడం ద్వారా మీకు డబ్బు కలిసి వస్తుంది.  రుణ భారం తీరే అవకాశం ఉంది.  సోమవారం శివాలయంలో శివలింగంపై ఆవు పాలు పోసి 11 ప్రదక్షిణలు చేయాలి.

వృశ్చికం:  ఈ రాశి వారికి  డబ్బు విషయంలో కాస్త ఏమరపాటుగా ఉన్నట్లయితే నష్టపోయే అవకాశం ఉంది,  ఈ రాశి వారు డబ్బును జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి. భవిష్యత్తు అవసరాలకు ఇప్పటినుంచే పొదుపు చేసుకుంటే మంచిది. . దుబారా ఖర్చులు చేసినట్లయితే మీరు నష్టపోయే అవకాశం ఉంది.  విద్యార్థులు కూడా  పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ రాశి వారు రాణించే అవకాశం ఉంది.  ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు కూడా తమ వృత్తిలో పై చేయి సాధించి అవకాశం ఉంది.  సాఫ్ట్ వేర్  రంగంలో పనిచేసే ఉద్యోగులు  శుభవార్త వినే అవకాశం ఉంది.  నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారు వారి ప్రయత్నాలు సఫలం అవుతారు.  నూతన వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఆదివారం  ఆవుకు అరటి పండ్లు తినిపించాలి. . అప్పుడు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.

(The above story first appeared on LatestLY on Feb 07, 2024 08:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).