Astrology: మల్లికార్జున స్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే..ఈ రాశుల వారికి అన్ని కష్టాలు తొలగి కోటీశ్వరులు అవడం ఖాయం..
Astrology: మల్లికార్జున స్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే..ఈ రాశుల వారికి అన్ని కష్టాలు తొలగి కోటీశ్వరులు అవడం ఖాయం..
తుల: ఈ రాశికి చెందిన వారు అతి త్వరలోనే మహారాజ యోగం కారణంగా ఉద్యోగంలోని వ్యాపారంలోనూ మంచి ఉన్నతిని సాధిస్తారు. విద్యా వైద్య రంగంలో వ్యాపారం చేసేవారు అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవాడు మంచి ప్రాజెక్టులు చేపడతారు. ఈ రాశికి చెందినవారు ఆరోగ్యం విషయంలో ఉన్న ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఆరోగ్య వంతులుగా మారుతారు. పూర్వీకుల నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
వృశ్చికం: ఈ రాశి వారు భూమి వివాదాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించే అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించినట్లయితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు నూతన ప్రాజెక్టులు పొందుతారు. ఫలితంగా అధిక లాభాలను పొందే వీలుంది. కుటుంబ జీవితంలో వీరు సుఖంగా జీవించే అవకాశం ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అయ్యప్ప స్వామిని పూజించండి.
కుంభం: ఈ రాశికి చెందినవారు దూర ప్రాంతాల్లో వ్యాపారం చేసినట్లయితే చక్కగా రాణించే అవకాశం ఉంటుంది. నూతనంగా ప్రారంభించినటువంటి పనులు విజయవంతం అవుతాయి. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించినట్లయితే అవి వేగం పుంజుకుంటాయి. ఆస్తి వివాదాలు సమసిపోయి జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నటువంటి పనులు పూర్తవుతాయి. అన్నదమ్ముల నుంచి తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారు. కుక్కకు రొట్టెలు తినిపించండి.
మీనం: ఈ రాశికి చెందిన వారు వ్యాపారంలో రాణిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే మంచి పెట్టుబడి లభిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేసేవారు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. బీటెక్ చదివిన విద్యార్థులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా లభించే అవకాశం ఉంటుంది. నూతన వివాహ ప్రయత్నాలు చేసే వారికి చక్కటి తోడైన జంట లభిస్తుంది. . శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Jun 26, 2024 06:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

