Astrology: శని తిరోగమన కదలిక వల్ల జూలై 18 నుండి ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

జూలై 18 నుండి ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాల్లో అల్లోకల్లోలం సృష్టిస్తాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు శని తిరోగమన కదలిక వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ మూడు రాశులు ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology: శని తిరోగమన కదలిక వల్ల జూలై 18 నుండి ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి
astrology

జూలై 18 నుండి ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాల్లో అల్లోకల్లోలం సృష్టిస్తాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల  వారు శని తిరోగమన కదలిక వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ మూడు రాశులు ఇప్పుడు తెలుసుకుందాం.

సింహరాశి: ఈ రాశి వారికి శని తిరోగమనడం వల్ల ప్రతి పనిలో కూడా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. పూర్వికుల నుంచి రావాల్సిన ఆస్తులు రాకుండా వివాదాలు తలెత్తే ఎటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి ఉండదు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే మానుకోండి ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల జీవితంలో మానసిక సమస్యలు, స్ట్రెస్ బాగా పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయే సమస్య పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నష్టాలు వచ్చే అవకాశం చాలా ఉంది.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి

తులారాశి: ఈ రాశి వారికి తిరోగమన శని కారణంగా ఆర్థిక సమస్యలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక పార్ట్నర్షిప్లో వ్యాపారాలు చేయవలసి వస్తే మానుకోండి. ఎందుకంటే నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అభిప్రాయ భేదాలు కారణంగా మీ జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది విడిపోవడానికి కూడా దారితీస్తుంది. కాబట్టి అనవసరంగా ఏ విషయంలో కూడా తలదూర్చకండి.

మీన రాశి: శని తిరోగమన కారణంగా తులా రాశి వారికి ప్రతికూల ప్రభావం ఉంది. వీరికి కోపము మొండితనము ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వివాదాల జోలికి వెళ్ళకండి ఎందుకంటే మిమ్మల్ని నేరస్తులుగా చేసే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆదాయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయకండి. విద్యార్థులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.

(The above story first appeared on LatestLY on Jul 17, 2024 05:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).