Happy Kanuma Wishes: కనుమ శుభాకాంక్షలు తెలిపే కోట్స్ , మీ స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు ఈ మెసేజెస్ ద్వారా కనుమ శుభాకాంక్షలు చెప్పేయండి
సంక్రాంతి (Sankranthi) పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే.
Happy Kanuma Telugu Wishes: సంక్రాంతి (Sankranthi) పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు.
ఏడాదికాలంగా తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు.
ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ కోట్స్ ద్వారా మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు కనుమ శుభాకాంక్షలు చెప్పేయండి

Kanuma Quotes: కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ. శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ. మనలోని మంచితనాన్ని వెలిగించే దినం కనుమ. అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ. మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!

మూన్నాళ్ల సంబరం.. ఏడాదంతా జ్ఞాపకం. స్వరం నిండిన సంగీతాల సంతోషాలు మనసొంతం. ఈ దినం, ఊరించే విందుతో పసందైన వేడుక చేసుకుందాం! కనుమ పండుగ శుభాకాంక్షలు.

మట్టిలో పుట్టిన మేలిమి బంగారం, కష్టం చేతికి అంది వచ్చే తరుణం. నేలతల్లి, పాడి పశువులు అందించిన వర ప్రసాదం. 'కనుమ' లా వడ్డించింది పరమాన్నం. కనుమ పండగ శుభాకాంక్షలు!

రోకల్లు దంచే ధాన్యాలు, మనసుల్ని నింపే మాన్యాలు. రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన మన పాడి-పశువులు.. మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి ఇలాంటి వేడుకలు. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు!

తులే రాజుగా, రాతలే మార్చే పండుగ. పంట చేలు కోతలతో ఇచ్చే కానుక. మంచి తరుణాలకు కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ, ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుక. కనుమ పండుగ శుభాకాంక్షలు!
ఈ సంక్రాంతి పండగ ఆనందాలు ఎప్పటికీ నిలవాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున కనుమ శుభాకాంక్షలు
(The above story first appeared on LatestLY on Jan 13, 2023 12:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

