Happy Kanuma 2022 Wishes: కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, పశువులు కూడా మన జీవితంలో భాగమే అని చాటి చెప్పే ఏకైక పండుగ,  కనుమ శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, సోషల్ మీడియా స్టేటస్ లు మీకోసం 
Kanuma Wishes in Telugu (1)

సంక్రాంతి (Sankranthi) పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు.

ఏడాదికాలంగా తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు.

కనుమరోజు అడవిలో దొరికే వివిధ వనమూలికతో కూడిన మిశ్రమాన్ని పశువులకు తినిపిస్తారు. దీనిని ఉప్పుచెక్క అని కూడా అంటారు. ఏడాది కొకసారి పశువులకు ఉప్పుచెక్కను తినిపిస్తే అది వాటికి సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని రైతుల నమ్మకం.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తీసుకెళ్లి, వాటికి శుభ్రంగా స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను రంగులు అద్దుతూ, ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలతో అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలి వేసి వాటికి విశ్రాంతినిస్తారు.

మూడు రోజుల సంక్రాంతి సంబరం, ఏడాదంతా జ్ఞాపకం. రైతన్నల నేస్తాలకు 'పసందైన విందు'తో జరుపుకునే పండగే కనుమ. తెలుగు సంస్కృతి- సంప్రదాయాలకు అద్ధంపట్టేలా, కనుమ పండగ విశిష్టత తెలిపే సందేశాలు, 

సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు. వచ్చే ఏడాదిలో కూడా పాడిసంపద వృద్ధి చెంది, పంటలు సమృద్ధిగా పండితే మరింత ఘనంగా పూజలు చేస్తామని కాటమరాజుకు యాటలు కోసి మొక్కులు సమర్పించుకుంటారు. కనుమ రోజు ఇంట్లో పసందైన మాంసాహార వంటకాలు వండుతారు. కుటుంబ సభ్యులు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం కనుమను ఘనంగా జరుపుకుంటారు.

ఇక సంక్రాంతి ముగింపు వేడుకలుగా చెప్పబడే ఈ కనుమ పర్వదినాన్ని మీ కుటుంబ సభ్యులంతా కలిసి గొప్పగా జరుపుకోవాలని, ఈ సంక్రాంతి వేడుకలు ఏడాదికి సరిపోయే మధుర జ్ఞాపకాలు మిగిల్చాలని ఆకాంక్షిస్తూ కనుమ శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, సోషల్ మీడియా స్టేటస్ లు అందిస్తున్నాం. కనుమ గొప్పదన్నాన్ని, విశిష్టతను, తెలుగు సాంప్రదాయాలను తెలిపే ఈ సందేశాలు మీ ద్వారా మీ తరాని, రాబోయే తరానికి వ్యాప్తి కావాలని కోరుకుంటున్నాం.

Kanuma Wishes in Telugu (1)

మిత్రులకు కనుమ పండుగ శుభాకాంక్షలు

Kanuma Wishes in Telugu (1)

మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు

Kanuma Wishes in Telugu (3)

వ్యవసాయంలో తమతో పాటు

కష్టించే పశువులను పూజించే పండుగ కనుమ

అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు

Kanuma Wishes in Telugu (4)

ఏడాది పొడవునా

తమ కష్టంలో పాలు పంచుకునే

పశువులను, రైతన్నలు పూజించే పండుగ కనుమ.

తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు

Kanuma Wishes in Telugu (5)

వ్యవసాయంలో తమకు

తోడుగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలిపే పండుగ

అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు