
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఏకాదశికి ముందు, సూర్యుడు ,కుజుడు చాలా ప్రత్యేకమైన మరియు శుభప్రదమైన నవపంచమ యోగాన్ని సృష్టించారు. ఈ యోగా శుభ ప్రభావం కారణంగా, 3 రాశుల వ్యక్తుల జీవితాల్లో అదృష్టం బంగారు మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ 3 అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం
మేషరాశి- ఈ సమయం మేష రాశి వారికి చాలా శుభప్రదం. సూర్యుడు ,కుజుడు కలయిక వారి ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచుతుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాలలో కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత అప్పుల నుండి మీరు ఉపశమనం పొందవచ్చు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. ఓపికగా, కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా విజయం లభిస్తుంది.
సింహ రాశి- సింహ రాశి వారికి కెరీర్ మరియు సామాజిక ప్రతిష్ట పరంగా ఇది చాలా మంచి సమయం. సూర్యుడు ,కుజుడు ఈ కలయిక మీ నాయకత్వ సామర్థ్యాన్ని ,నిర్ణయం తీసుకునే శక్తిని పెంచుతుంది. వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో, మీరు మీ కృషి అంకితభావానికి ప్రతిఫలాలను పొందుతారు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. అనవసరమైన వివాదాలను నివారించండి.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి
ధనుస్సు రాశి- ధనుస్సు రాశి వారికి ఇది ఆర్థికంగా మరియు మానసికంగా ఆనందంగా ఉండే సమయం అవుతుంది. సూర్యుడు, కుజుడు నవపంచమ యోగం వారి కొత్త ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. మీరు విద్య జ్ఞాన రంగంలో కూడా విజయం పొందుతారు. ఈ సమయంలో, మీ సానుకూల ఆలోచన కృషి మీకు విజయాన్ని తెస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.