Vasant Panchami 2023: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు, గురువారం వేకువజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం
తెలంగాణలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో విజయరామారావు ఆదివారం ఒక ప్రకటనలోతెలిపారు.
తెలంగాణలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో విజయరామారావు ఆదివారం ఒక ప్రకటనలోతెలిపారు. గురువారం వేకువజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భక్తులకు అనుమతి లేదని తెలిపారు.
అనంతరం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య రాష్ట్ర ప్రభుత్వ తరుఫున మంత్రి, ఎమ్మెల్యేలు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారని వివరించారు. అక్షరాభ్యాసం వేకువ జామున 3 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మిగతా ఆర్జిత సేవలు 26న ఉండవని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్‌లో పండ్లు, మంచినీరు, పాలు అందించనున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
(The above story first appeared on LatestLY on Jan 23, 2023 09:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

