Prostate Cancer: హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట, రోజూ శృంగారంలో పాల్గొన్నా ఆ ముప్పు తగ్గినట్లే, తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో హస్త ప్రయోగం (can Daily Masturbation and sex ) ఎక్కువగా చేయడంవల్ల, తరచూ శృంగారంలో పాల్గొనడంవల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవని, పైగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని తేలింది.
హస్త ప్రయోగం, శృంగారంపై చాలా మందికి అనేక రకాలైన అపోహలుంటాయి. ఎక్కువగా హస్త ప్రయోగం చేయడంవల్ల శృంగార పటిమ తగ్గిపోతుందని కొందరు ఆందోళన చెందుతుంటారు. అలాగే అతిగా శృంగారంలో పాల్గొంటే శారీరకంగా బలహీనమై పోతామని మరికొందరు భయపడుతుంటారు. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో హస్త ప్రయోగం (can Daily Masturbation and sex ) ఎక్కువగా చేయడంవల్ల, తరచూ శృంగారంలో పాల్గొనడంవల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవని, పైగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని తేలింది.
వీలైనంత ఎక్కువ సార్లు అంగస్తంభన జరగడంవల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు (Prostate Cancer) చాలా వరకు తగ్గుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. మొత్తం 32 వేల మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. నెలలో ఏడు లేదా అంతకంటే తక్కువ సార్లు శృంగారం లేదా హస్తప్రయోగం చేసే వారితో పోలిస్తే.. 21 సార్లు శృంగారం లేదా హస్తప్రయోగం చేసే వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు 19 శాతం తక్కువ ఉన్నట్లు గుర్తించారు.
అదేవిధంగా 40 ఏండ్ల వయసువాళ్లు తరుచూ శృంగారం లేదా హస్తప్రయోగం చేస్తే ప్రొస్టేట్ ముప్పు 22 శాతం తక్కువగా ఉన్నట్లు కనిపెట్టారు. అయితే ఈ విషయంలో ఇదే మొదటి పరిశోధన కాదు. గతంలో ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి అధ్యయనం జరిగింది. సగటున వారానికి 3 కంటే తక్కువ సార్లు హస్తప్రయోగం లేదా శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే.. 7 సార్లు శృంగారం లేదా హస్తప్రయోగం లేదా శృంగారం చేసే వాళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు 36 శాతం తక్కువ ఉందని ఆ అధ్యయనంలో తేలింది.
అయితే అంగస్తంభనకు, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పునకు మధ్య సంబంధంపై ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. ఈ రెండింటికి లింకేంటి అనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. తాజా పరిశోధన చేసిన శాస్త్రవేత్త జెన్నీఫర్ రైడర్ మాత్రం ఈ రెండింటికి సంబంధం ఉందంటున్నారు. అంగస్తంభన ఫ్రీక్వెన్సీ అనేది పురుషుడి మొత్తం ఆరోగ్యానికి ఓ సూచిక అని చెప్పారు. నెలలో 3 సార్లు కంటే తక్కువగా అంగస్తంభన అయితే వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ కాకపోయినా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.
(The above story first appeared on LatestLY on Nov 20, 2021 03:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

