Health Tips: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటుంది.

Health Tips: మన శరీరానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మినరల్స్ చాలా అవసరం అందులో మెగ్నీషియం కూడా చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి.

Health Tips: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటుంది.
(Credits: X)

Health Tips: మన శరీరానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మినరల్స్ చాలా అవసరం అందులో మెగ్నీషియం కూడా చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. మెగ్నీషియం తీసుకోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఈరోజు మనం మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మెగ్నీషియం మన ఎముకల బలోపేతానికి దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా ఉంచుతుంది. రక్తహీనత సమస్యను తొలగిస్తుంది ఇవి మెగ్నీషియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెగ్నీషియం లోపం లక్షణాలు- కండరాల నొప్పి ,ఎముకల్లో నొప్పి, అదే విధంగా అలసట, నిరాశ ,ఆందోళన. నిద్రలేమి సమస్యలు, గుండె కొట్టుకోవడంలో వేగం, త్వరగా ఒత్తిడికి గురవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి..

మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు..

ఆకుకూరలు- ఆకుకూరలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. బచ్చలి కూర, మెంతికూర, పాలకూరలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా మెగ్నీషియo లోపాన్ని తగ్గించుకోవచ్చు.

Health Tips: గర్భధారణ సమయంలో షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే

డ్రై ఫ్రూట్స్- డ్రై ఫ్రూట్స్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బాదం, వాల్నట్, ఎండు ఖర్జూర, అంజీర లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో ప్రతి రోజున వీటిని భాగం చేసుకోవడం ద్వారా మెగ్నీషియంలో పని అధిగమించవచ్చు..

డార్క్ చాక్లెట్- డార్క్ చాక్లెట్లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మెగ్నీషియన్ లో పని అధిగమించవచ్చు.

పాల ఉత్పత్తులు- పాలు, పెరుగు, పన్నీరు, చీజ్ వంటి వాటిలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని మీరు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మెగ్నీషియం లోపం సమస్యతో బాధపడే వారికి ఇవి చక్కటి వరంగా చెప్పవచ్చు.

ఇంకా చేపలు, మాంసాహారం, అరటి పళ్ళు ,బొప్పాయ వంటి వాటిలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, వీటిని తీసుకోవడం వల్ల కూడా ఈ లోపం నుంచి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి

(The above story first appeared on LatestLY on Jan 28, 2025 02:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).