Health Tips: గర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య అని అంటారు. ఈ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరికీ కూడా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ రాకుండా చేసుకోవచ్చు. గర్భధారణ సమయంలో శరీరం అనేక రకాల మార్పులను చోటు చేసుకుంటుంది. దీనివల్ల కొన్నిసార్లు కొంతమందిలో షుగర్, బిపి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందిలో థైరాయిడ్ సమస్య కూడా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జస్టిషనల్ డయాబెటిస్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది డెలివరీ తర్వాత కూడా కొంతమందిలో కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
మంచి ఆహారం- గర్భ నా వలన సమయంలో పోషకాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్డు ,కూల్డ్రింక్స్, ఐస్ క్రీము, ఆయిల్ ఫుడ్స్ ను దూరంగా ఉండాలి. స్వీట్స్ కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. వీటివల్ల ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
వ్యాయామం- గర్భధారణ సమయంలో ఆహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా బరువు పెరుగుతూ ఉంటారు. దీన్ని తగ్గించుకోవడం కోసం చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. దీని ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగదు. దీనివల్ల షుగర్ వంటివి రాకుండా ఉంటాయి.
బరువు కంట్రోల్లో ఉంచుకోవాలి- గర్భధారణ సమయంలో బిడ్డ పోషకాల కోసం తల్లి ఎక్కువగా తినాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో కాస్త బరువు పెరుగుతారు. అయితే మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండకుండా ప్రోటీన్, విటమిన్లు ఉన్నవాహరాలు తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల గర్భధారణలో వచ్చే షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు.
ఒత్తిడి, ఆందోళన- గర్భధారణ సమయంలో హార్మోన్లో చేంజెస్ వల్ల ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు ఏర్పడతాయి. దీన్ని తగ్గించుకోవడం కోసం ధ్యానం మెడిటేషన్ వంటివి చేసినట్లయితే ఇవి కూడా షుగర్ రాకుండా ఉంచుతాయి. స్ట్రెస్ వల్ల ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దర్బదారణ సమయంలో ఎటువంటి ఆందోళన ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి