Indian Flag (Photo Credits: Wikimedia Commons)

భారతదేశానికి మరో అంతర్జాతీయ గౌరవం దక్కబోతోంది.2030 కామన్వెల్త్ క్రీడలను భారత్ నిర్వహించబోతుంది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఈరోజు (అక్టోబర్ 16) ప్రకటించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఈ మహత్తర క్రీడా సమారంభానికి వేదిక కానుంది. జైశంకర్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్) లో పోస్ట్ చేస్తూ.. ఇది భారత్‌కే కాదు, గుజరాత్‌కూ గర్వకారణమైన క్షణం. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, క్రీడా ప్రతిభను అభివృద్ధి చేయాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు.

ఈ ప్రకటనకు ముందు కామన్వెల్త్ గేమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశమై.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం కోసం అహ్మదాబాద్‌ను అధికారికంగా ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రత్యేక ప్రాధాన్యత కలిగినది. ఎందుకంటే 2030 సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ శతాబ్ది సంవత్సరం (100 years) కూడా. అంటే, ఈ క్రీడలకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంలో భారత్ ఆతిథ్యమివ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది.

దిగ్గజ క్రికెట్‌ అంపైర్‌ డికీ బర్డ్‌ కన్నుమూత, 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు చెప్పి అంపైరింగ్‌ వైపు..హస్యంతో క్రికెట్ ప్రేమికులను కట్టిపడేసిన లెజెండ్

అహ్మదాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఆధునిక క్రీడా సదుపాయాలు, ప్రపంచ స్థాయి స్టేడియాలు, రవాణా సౌకర్యాలు, ప్రభుత్వం చేపట్టిన కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించాయని అధికారులు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ స్వస్థలం కూడా గుజరాత్ కావడం వల్ల, ఈ ప్రాజెక్టు మరింత వేగంగా, ప్రతిష్టాత్మకంగా అమలు కానుంది. భారత్ చివరిసారి 2010లో న్యూ ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత సుమారు 20 ఏళ్లకు పైగా విరామం తర్వాత మళ్లీ భారత్ ఈ క్రీడలను నిర్వహించబోతోంది. 2030లో జరగబోయే ఈ క్రీడలు దేశంలోని క్రీడా రంగానికి, మౌలిక వసతుల అభివృద్ధికి, అంతర్జాతీయ క్రీడా పర్యాటనకు కొత్త ఊపును ఇవ్వనున్నాయి.