Chandipura Virus Alert(X)

Gujarat, July 21: వాయుగుండం ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోగా పలు వైరస్‌లు విజృంభిస్తున్నారు. ప్రధానంగా జ్వరాలు, దగ్గు,జలుబు వంటి వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండగా కొన్ని రాష్ట్రాల్లో ప్రమాదకర వైరస్‌ల దాడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.

ఇక ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్‌లో చండీపురా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఒక్క గుజరాత్‌లోనే 50కి పైగా కేసులు నమోదుకాగా 16 మంందికిపైగా మృతిచెందారు. మెదడుపై ఎటాక్ చేసే అ వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో వ్యాధి విస్తరణతో అప్రమత్తమైంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో అలర్ట్ ప్రకటించగా ఆయా జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేసేలా ప్రచారం నిర్వహించాలన్నారు. రోగులకు ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు గుజరాత్‌లో లక్షా 22 వేల మందికి పరీక్ష చేశారు. కేసుల కట్టడికి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

9 నెలల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లల్లో ఈ వైరస్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ వైరస్ సోకితే జ్వరం రావడం,వాంతులు,మూర్చ వంటి లక్షణాలు ఉండి చివరికి మరణం సంభవిస్తుంది. ఇప్పటివరకు దేశంలో ఈ CHPV వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటివరకు 322 మంది పిల్లలు మరణించారు. మంచి పోషకాహారం, ఆరోగ్యం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వైరస్‌ను నియంత్రించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని షాకింగ్ పోస్ట్, తన దరఖాస్తులు ఉన్నాయా?,చెత్తబుట్టలోకి వెళ్లాయా అని ప్రశ్న?