Ex DSP Nlini(FB)

Hyd, July 21: తెలంగాణ ఉద్యమంలో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసి ఎంతోమందికి ప్రేరణ ఇచ్చారు మాజీ డీఎస్పీ నళిని. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో సైతం పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ దరఖాస్తును అప్పటి పాలకులు పట్టించుకోలేదు. కానీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ డీఎస్పీ నళిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. నళిని తిరిగి ఉద్యోగం పొందేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఏడు నెలల క్రితం సచివాలయంలో కలిసి రెండు దరఖాస్తులు  సమర్పించారు నళిని. అయితే ఆమె దరఖాస్తు ఇచ్చిన ఏడు నెలలు గడుస్తున్న ఇంతవరకు చలనం లేదు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ ద్వారా స్పందించారు నళిని.

ఫేస్ బుక్ సారాంశం ప్రకారం, సిఎం సార్ కొలువుకు ఎక్కగానే నన్ను మీద మీద యాది చేసిండు .ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు. మధ్యల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగినాయి.ఆశ్చర్యంగా నా ఊసే ఎత్తలేదు.ఇంతకీ నా రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నయో లేక చెత్త బుట్టలోకి పోయినవోనని డౌట్ వస్తుంది. ఇప్పుడే చీఫ్ cro ను osd sir ని కదిలించా…! చిట్టి రాసిన. మా చిన్నప్పుడు ఆడుక్కొనేటోడు ఇంటి ముందుకు వస్తె ,ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి వెళ్లవయ్య అని మెల్లగా చెప్పేటోల్లం. కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి.అందుకే నేను ఇన్నేళ్ళు ఎవ్వరినీ కలవాలే.ఉద్యమం చేసేటప్పుడే నాకు చాలా విషయాలు అర్థం అయిందని వెల్లడించింది.

అలాగే ఒక నెలలోనే నా పిటిషన్ పై ఎంక్వైరీ పూర్తిచేస్తారు అనుకున్నా. 7 నెలలు కావొస్తోంది.అందుకే రిమైండర్ లెటర్,పోస్ట్ రాయాల్సి వచ్చింది. సెక్రటేరియట్ చూట్టూ తిరిగేంత సమయం మరియు ఓపిక నా వద్ద లేవు అని నేను ఆ రోజే రేవంతన్నకు చెప్పినా…! అని నళిని తన పోస్టులో రాసుకొచ్చారు. డిసెంబర్ 30, 2023వ తేదీన ముఖ్యమంత్రికి రెండు పిటిషన్లు ఇచ్చానని గుర్తు చేశారు. మరి నళిని ఇచ్చిన పిటిషన్‌పై ప్రభుత్వం, పోలీస్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి. వివాదంలో కల్కి సినిమా, హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ మేకర్స్‌కు స్వామిజీ నోటీసులు, అమితాబ్, కమల్‌కు కూడా

వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మాజీ డీఎస్పీ నళినికి స్పష్టమైన హామీ ఇచ్చారు. పోలీసు ఉద్యోగం కుదరకపోతే… అదే స్థాయిలో ఉండే మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నళిని అధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించనున్నాని ఇందుకు సంబంధించి వేద విద్యా కేంద్రంకు సహకారం అందించడంతో పాటు తన సర్వీస్ అంశానికి సంబంధించి లేఖలు ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన నళిని... అసలు తన రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయా, లేక చేత బుట్టలోకి పోయాయా..? అంటూ ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.