దీపావళి రాకముందే దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండ‌లి తెలిపింది. బుధవారం ఉదయం రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 300 దాటింది.వాయుకాలుష్యం పెరుగుతున్న కారణంగా ఎన్‌సీఆర్‌లో తొలి దశ ఆంక్షలు అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ అధికారులను ఆదేశించింది.

ఈ పరిస్థితుల మధ్య ఢిల్లీలో బాణాసంచా అమ్మ‌కాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో గ్రీన్ క్రాక‌ర్స్ కాల్చుకోవ‌చ్చు అని తెలిపింది. అక్టోబ‌ర్ 18 నుంచి 21వ తేదీ వ‌ర‌కు గ్రీన్ క్రాక‌ర్స్ అమ్మ‌కాల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు సీజేఐ బీఆర్ గ‌వాయ్‌, జ‌స్టిస్ వినోద్ చంద్ర‌న్‌తో కూడిన అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొన్న‌ది. సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఆ బాణాసంచా కాల్చుకోవ‌చ్చని కోర్టు చెప్పింది. వీడియో ఇదిగో, ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన యువకుడు, అర కిలో మీటర్ దూరం లాక్కెళ్లిన గోమాత, బాధితుడికి తీవ్రగాయాలు

 Firecracker Ban Partially Lifted in Delhi-NCR 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)