ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం మల్లిఖార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానికి లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఇక్కడి శివాజీ దర్బార్‌ హాల్‌, ధ్యాన మందిరాలను తిలకించనున్నారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శ్రీశైలం చేరుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

అక్టోబర్ 16న ప్రధాని మోదీ ఏపీ పర్యటన, రూ. 13 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని, శ్రీశైలం పర్యటన పూర్తి వివరాలు ఇవే..

శ్రీశైలం దర్శన అనంతరం మోదీ మధ్యాహ్నం కర్నూలు శివారులోని నన్నూరు టోల్‌గేట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సభలో ప్రధాని ‘సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌’ కార్యక్రమంపై ప్రసంగించనున్నారు. అనంతరం రూ. 13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

PM Modi visits Srisailam in Kurnool

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)