Dhanteras-Wishes in Telugu

ధంతేరస్, దీపావళి పండుగకు ముందే వచ్చే పండుగ. హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యత కలిగినది. దీన్ని త్రయోదశి నాడు జరుపుకుంటారు, అందుకే ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది (2025) ధంతేరస్ అక్టోబర్ 18న జరిగింది. దీపావళి వేడుకలు దీనితో ప్రారంభమై ఐదు రోజులు కొనసాగుతాయి. ధంతేరస్ అనేది సంపద, శ్రేయస్సు,అదృష్టాన్ని పెంపొందించే పవిత్ర రోజు.

ధంతేరస్ అర్థం, ప్రాముఖ్యత: ధనత్రయోదశి అంటే ధనాన్ని పెంచే త్రయోదశి. ఈ రోజున భక్తులు ధన్వంతరి భగవానుడి, కుబేరుడి, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. సాంప్రదాయ ప్రకారం సముద్ర మధన సమయంలో ధన్వంతరి భగవానుడు క‌లశంతో దర్శనమిచ్చినట్లు నమ్మకం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అపమృత్యు నివారణ కోసం దీపాలు వెలిగించడం యమదీపం వేయడం సంప్రదాయం.

ధంతేరస్ రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఆనవాయితీ. ఇంటి చుట్టూ దీపాలు వెలిగించి, గోధుమ, పెసలు, మినుములు, కందులు, బార్లీ వంటి విందు వస్తువులను సమర్పిస్తారు. దీన్ని చేయడం ద్వారా సుఖసంపద, శ్రేయస్సు, మరియు అదృష్టం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజు ‘అదృష్ట లక్ష్మి’ భక్తుల ఇంటికి అతిథిగా వస్తుందని నమ్మకం ఉంది.

ధన త్రయోదశి శుభాకాంక్షలు, ధంతేరస్ విషెస్ తెలుగులో చెప్పాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఇమేజెస్ రెడీగా ఉన్నాయి మరి..బెస్ట్ కోట్స్ ఇవిగో..

ధంతేరస్ రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. బంగారం కొనుగోలు చేయడం సంపద, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది, ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా అది రెట్టింపు లభిస్తుందని నమ్మకం ఉంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, పెట్టుబడులు మొదలుపెట్టడానికి ఈ రోజును అనుకూలంగా భావిస్తారు.

బంగారం, వెండితో పాటు లక్ష్మీ, గణేశుడి విగ్రహాలను కొనుగోలు చేయవచ్చు. చిన్న చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించి కొనుగోలు చేయడం వల్ల పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. వాహనం కొనుగోలు చేయడం కూడా శ్రేయస్కరంగా పరిగణించబడుతుంది.

ధంతేరస్ అనేది సంపద, అదృష్టం, శ్రేయస్సు, భక్తిని కలిగించే పవిత్ర రోజు. దీన్ని జరుపుకోవడం ద్వారా వ్యక్తిగత, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ శ్రేయస్సు లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. బంగారం, వెండి, ఆహార పదార్థాలు, విగ్రహాలు కొనుగోలు చేయడం సంప్రదాయం. అలాగే దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవిని ఆహ్వానించడం ముఖ్యమైన భాగాలు.