జగ్గయ్యపేట నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్‌టీసీ బస్సులో ఓ మహిళ బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగింది. బస్ ఫుట్‌బోర్డ్ నుండి లోపలికి వెళ్లమని డ్రైవర్ సూచించిన తరువాత డ్రైవర్, మరో ప్రయాణికునితో తీవ్రంగా గొడవకు దిగింది. ఈ సంఘటన బస్‌లో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల ముందు చోటుచేసుకుంది. మహిళ ప్రయాణికురాలు మొదట ఫుట్‌బోర్డ్ మీద నిలబడి ఉండగా, బస్సు సురక్షిత ప్రయాణ నియమాల కారణంగా డ్రైవర్ ఆమెను బస్ లోపలికి వెళ్లమని తెలిపాడు. అయితే ఆమె ఆ సూచనను స్వీకరించకుండా తీవ్రంగా ప్రతివాదించింది.
అక్కడే ఉన్న ఇతర ప్రయాణికుడు కూడా అడగడంతో ఘటన గొడవకు దారి తీసింది. నా ఫోటో తీసుకో.. విజయవాడ పోలీస్ స్టేషన్‌లో నా బొమ్మ చూపించు, గుర్తుపట్టకపోతే అడుగు” —అని హెచ్చరిస్తూ ఆమె వారిపై విరుచుకుపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసుల కథనం మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ జగ్గయ్యపేట డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును విజయవాడలో ఎక్కింది. అయితే ఆమె పరిటాలలో దిగాల్సి ఉంది. ఆమె బస్సు ఎక్కి ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉండగా.. గమనించిన డ్రైవర్ ఆమెను లోపలికి వెళ్లమని సూచించాడు. దీనిపై ఆమె డ్రైవర్‌తో గొడవకు దిగింది.
ఎందుకు డ్రైవర్‌పై గొడవ పడతున్నావన్న కండక్టర్ పైనా ఆమె తన ప్రతాపాన్ని చూపించింది. ఇద్దరు కలసి నన్నే మందలిస్తారా.. ఇది ఫ్రీ బస్సు.. నా ఫొటో తీసుకో.. ఈ ఫొటోను విజయవాడ సిటీలో లేదా చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చూపించుకో.. నా ఫొటో చూడగానే పోలీసులకే దడ పుడుతుందంటూ కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తించింది.
‘అమ్మా కండక్టర్ అయ్యప్ప మాల ధరించాడు అతనిపై దుర్భాషలాడకూడదు’ అని హితవు పలికిన సాటి మహిళలపై కూడా ఆమె విరుచుకుపడింది. బస్సు డ్రైవర్ పరిటాల గ్రామంలో బస్సును ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్‌స్టేషన్ వద్ద బస్సు ఆపి మహిళపై ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ విశ్వనాథ్ మహిళను మందలించి కండక్టర్, డ్రైవర్‌లకు సర్ది చెప్పి పంపించి వేశారు.