Health Tips: ప్రతిరోజు ఈ గింజలు తింటే చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ లభించడం ఖాయం..

Health Tips: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన కండరాలకు అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మూలకాలు అవసరమవుతాయి. అందులో ముఖ్యంగా ప్రోటీన్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Health Tips: ప్రతిరోజు ఈ గింజలు తింటే చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ లభించడం ఖాయం..
Walnuts (Photo Credits: Pixabay)

Health Tips: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన కండరాలకు అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మూలకాలు అవసరమవుతాయి. అందులో ముఖ్యంగా ప్రోటీన్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మనం ప్రోటీన్ కేవలం చికెన్ నుంచి మాత్రమే ఎక్కువ వస్తుందని చాలామంది భావిస్తారు. అయితే చికెన్ కంటే ఎక్కువ కూడా కొన్ని శాఖాహార ఆహార పదార్థాలలో ఉంటాయని చాలామందికి తెలియదు. చికెన్ కంటే అధికంగా ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గుమ్మడి గింజలు- గుమ్మడి గింజల్లో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 37 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది చికెన్ కంటే చాలా ఎక్కువ ఇందులో అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మెగ్నీషియం జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని వేయించుకొని ప్రతి రోజు చిరు తిండిలాగా తింటే లేదా సలాడ్స్ రూపంలో లేదా స్మూతీలో చేర్చుకొని తినడం ద్వారా ప్రోటీన్ మీకు రోజువారి కావలసినంత లభిస్తుంది.

Health Tips: ఎన్ని వ్యాయామాలు చేసిన బరువు తగ్గట్లేదా

సోయా- సోయా ప్రోటీన్ కి అద్భుతమైన మూలంగా చెప్పవచ్చు 100 గ్రాముల సోయాలో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అంతేకాకుండా సోయా మిల్క్ సోయా చాన్స్ లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది సోయా ఉత్పత్తులు ముఖ్యంగా శాఖాహార ఉన్నవారికి చక్కటి ఎంపికగా చెప్పవచ్చు..

బీన్స్- బీన్స్ లలో కూడా ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది ఇది శాకాహారులకు ఒక చక్కటి ఎంపికగా చెప్పవచ్చు 100 గ్రాముల బీన్స్ నుంచి 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది మాంసాహారంతో పోలిస్తే చాలా ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది అంతేకాకుండా ఇందులో ఐరన్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది ప్రతిరోజు మీరు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రోటీన్ సమస్య నుంచి బయటపడవచ్చు..

ఎర్ర పప్పు- పప్పును ప్రతిరోజు మనం ఆహారంలో భాగం చేసుకునే ఉంటాము. అయితే చికెన్ కంటే ప్రోటీన్ పప్పులో అధికంగా ఉంటుంది. 100 గ్రాముల ఎర్ర పప్పులో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా ఫైబరు ,ఐరన్ కూడా పుష్కలంగా అందుతాయి.

వాల్ నట్స్- వాల్ నట్స్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల వాల్నట్స్లో 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ లో మన శరీరానికి అందుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆహార పదార్థాలను మీరు ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రోటీన్ లోపం సంస్థ ఉన్నవారికి ఇది చక్కటి ఎంపికగా చెప్పవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 03:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).