Lancet says one in eight people globally is now obese (Photo Credit: Pixabay)

Health Tips: ఈ మధ్యకాలంలో బరువు పెరగడం అనేది చాలామందిలో కనిపిస్తున్న సమస్య వీరు ఎన్ని వ్యాయామాలు చేసినా ఎంత డైట్ కంట్రోల్ చేసిన కూడా బరువు అనేది అస్సలు తగ్గరు అయితే మనము కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల బరువు తగ్గకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ చిన్న చిన్న మిస్టేక్స్ మనము గుర్తించలేము. అయితే ఉదయాన్నే చాలామంది బరువు తగ్గడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు దీనివల్ల బరువు అసలు తగ్గరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రేక్ ఫాస్ట్ మానేయడం- చాలామంది బరువు తగ్గాలని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ను మానేస్తూ ఉంటారు. దీని వల్ల బరువు తగ్గకపోగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రంతా పొట్ట ఖాళీగా ఉంటుంది. ఉదయాన్నే మంచి ప్రోటీన్ విటమిన్ లో ఉన్న ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్ గా తీసుకున్నట్లయితే బరువు తగ్గుతారు. దీంతోపాటు రోజంతటికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనేది మానేయకూడదు.

Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా పచ్చిగా తినకూడదు ...

నీళ్లు తాగకపోవడం- చాలామంది మీరు చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. దీనివల్ల బరువు తగ్గరు. రోజులో కనీసం 8 గ్లాసుల నీరు ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీరు రాగడం వల్ల మెటబాలిజం పెరిగి వెయిట్ లాస్ కి సహకరిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళతాయి. ఇది వెయిట్ లాస్ లు ప్రమోట్ చేస్తుంది.

యాక్టివిటీ లేకపోవడం- చాలామంది ఉదయాన్నే అంతా యాక్టివ్ గా ఉండరు. ఉదయాన్నే లేచి కాస్త వ్యాయామం వాకింగ్ వంటివి చేసినట్లయితే రోజంతా యాక్టివ్ గా ఉంటారు. దీంతో పాటు మెటాబాలిజం కూడా పెరుగుతుంది దీనివల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది దీని ద్వారా బరువు తగ్గుతారు. ఉదయాన్నే కాస్త యాక్టివ్ గా ఉండేలాగా కొన్ని పనులు చేయడం ద్వారా బరువు తగ్గుతారు.

ఉదయం ఎక్కువసేపు నిద్రపోవడం- చాలామంది ఈ మధ్యకాలంలో రాత్రులు ఎక్కువ సేపు మేల్కొని దాన్ని కవర్ చేయడం కోసం ఉదయాన్నే ఎక్కువసేపు పడుకుంటారు. దీనివల్ల బరువు పెరుగుతారు. దీనివల్ల మెటబాలిజం తగ్గుతుంది. జీర్ణక్రియ రేటు కూడా సక్రమంగా జరగదు. దీనివల్ల బరువు తగ్గరు కాబట్టి ఉదయాన్నే లేవడం మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి