Health Tips: భోజనం చేసిన వెంటనే మీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా అయితే ఈ చిట్కాలను పాటించండి.

Health Tips: కొంతమందిలో భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ గా కడుపు పట్టేసినట్టుగా వంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ సమస్యతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Health Tips: భోజనం చేసిన వెంటనే మీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా అయితే ఈ చిట్కాలను పాటించండి.
gas

Health Tips: కొంతమందిలో భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ గా కడుపు పట్టేసినట్టుగా వంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ సమస్యతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు తిన్న తర్వాత కడుపుకి ఉబ్బరము లేకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటిస్తున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీలకర్ర నీరు- ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉదయాన్నే జీలకర్ర నీటిని తాగడం ద్వారా  గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. తిన్న వెంటనే కడుపు ఉబ్బినట్టుగా అనిపించే సమస్య తగ్గించుకోవడానికి ఈ జీలకర్ర నీరు చాలా బాగా సహాయపడుతుంది. జీలకర్రలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది.

Health Tips: విటమిన్ డి టాబ్లెట్ లు అతిగా వాడుతున్నారా

బొప్పడి పండు- బొప్పడి పండును కూడా మీరు ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఇది కడుపుబ్బరం వంటి సమస్యను తగ్గిస్తుంది.  బొప్పడి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

వాము- వాములో గ్యాస్ ట్రబుల్ ని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. వాముని ప్రతి రోజు భోజనం తర్వాత ఒక స్పూన్ తిన్నట్లయితే కడుపుబ్బరం, అజీర్ణం, కడుపులో నొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కడుపు సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

వజ్రాసనం- తిన్న తర్వాత వెంటనే వజ్రత్నం వేయడం ద్వారా కడుపు ఉబ్బరమని సమస్య తొలగిపోతుంది. వజ్రసనం వేయడం ద్వారా తిన్న వెంటనే భోజనము అరిగితుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. భోజనం చేసిన తర్వాత చేసే ఏకైక ఆసనం వజ్రాసనం దీని ద్వారా కడుపు బలం కడుపులో నొప్పి, గ్యాస్ కి సమస్యలు వాటివి తొలిగిపోతాయి, ఇది భోజనం చేసిన వెంటనే వేయొచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి

(The above story first appeared on LatestLY on Jan 28, 2025 02:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).