Representative Image (IImage: File Pic)

Health Tips: మన శరీరానికి విటమిన్ లో చాలా ముఖ్యం. అయితే శరీరంలో విటమిన్-డి తగినంత ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇది మన ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల బలహీన పడకుండా ఉండడానికి రోగనిరోధక శక్తి పెంచడానికి డి విటమిన్ చాలా ఉపయోగపడుతుంది. అయితే విటమిన్ డి అనేక రకాలుగా బలపేతం చేస్తుంది మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ గ్రంథిని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే విటమిన్ డి లోపం కోసం చాలామంది అనేక రకాల సప్లిమెంట్స్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది వైద్యుని సంప్రదించి మీ డి విటమిన్ యొక్క లెవెల్స్ ని చూసుకొని సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది లేకపోతే విటమిన్ డి టాక్సి సిటీ ప్రమాదాన్ని పెంచుతుంది..

విటమిన్ డి లోపం- విటమిన్ డి లోపం ఎక్కువగా సూర్యరష్మి తగలని వారికి ఇంట్లో ఎక్కువ సేపు సమయం గడిపే వారికి ఆఫీసులలో ఎక్కువ సేపు ఉండే వారికి స్థూలకాయం బాధపడే వాడికి నల్లటి చర్మంతో బాధపడే వారికి పాలు, పాల ఉత్పత్తులను అస్సలు తీసుకొని వారికి విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది..

విటమిన్ డి సప్లిమెంట్లను ఎప్పుడు తీసుకోవాలి- విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుని సంప్రదించి మీ విటమిన్ డి ఎంత మోతాదులో ఉందో తెలుసుకొని ఎంత కాలం వాడాలో తెలుసుకొని వాడడం మంచిది.

అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు- విటమిన్ డి అధిక మోతాదులో తీసుకోవడం వల్ల చాలా హానిని కలిగిస్తుంది. అవసరమైన దానికంటే ఎక్కువగా డి విటమిన్ తీసుకోవడం వల్ల హైపర్ క్యాల్షిమియా వంటి సమస్యలు ఏర్పడతాయి. వికారం, వాంతులు, బలహీనత, ఆకలి కోల్పోవడం మూత్రపిండాల సమస్యలు వంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా విటమిన్ డి ని తీసుకోవడం వల్ల టాక్సిసిటీ ఏర్పడి ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఎక్కువ కాలం పాటు విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటే అనేక రకాల నష్టాలు కలుగుతాయి.

Health Tips: ఎన్ని వ్యాయామాలు చేసిన బరువు తగ్గట్లేదా 

కాల్షియం పెరుగుతుంది- విటమిన్ డి శరీరంలో క్యాల్షియం సోషన్ను పెంచుతుంది విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో క్యాల్షియం స్థాయిలో పెరుగుతాయి దీనివల్ల ఆకలి లేకపోవడం దాహం పెరగడం తరచుగా మూత్ర విసర్జన అవ్వడం వాంతులు వికారం తీవ్ర బలహీనత అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి..

మూత్రపిండాలకు ఇబ్బంది.. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో క్యాల్షియం నిల్వలు ఏర్పడతాయి ఇది మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరిచేలాగా చేస్తుంది.

ఎంత తీసుకోవాలి- విటమిన్ డి లోపం ఉన్నవారు పెద్దవారు రోజువారికి 800iu  తీసుకోవాలి. ఇది వారి శారీరక పరిస్థితిని బట్టి ఎంత మోతాదు తీసుకోవాలో వైద్యుని సంప్రదించి తీసుకోవడం ఉత్తమం. విటమిన్ డి స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకుని మందులు వాడడం ఉత్తమం..

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి