ప్రశ్న : హాయ్.. నాకు ఉన్న సమస్య గురించి చెప్పాలంటే నిజంగా కాస్తా ఇబ్బందిగా ఉంది. కానీ, దీని గురించి చెప్పక తప్పట్లేదు. అదేంటంటే.. నేను శృంగారం చేసేది నా భార్యతోనే. అయితే నాకు శృంగారం చేయాలనిపించినప్పుడు నా భార్య దగ్గరికి వెళ్తే తను నన్ను దూరం పెడుతోంది చేస్తుంది. తను ఎందుకు దూరం పెడుతుందో అర్థం కావడం లేదు. నేను ఇలాంటి సిట్చ్యుయేషన్‌లో ఏం చేయను. సలహా ఇవ్వండి.
జవాబు: మీ సమస్యను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ విషయంలో మీరు సిగ్గు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే శృంగారం అనేది సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు. ఇది దంపతుల మధ్య కచ్చితంగా ఉండి తీరాల్సిన విషయం. దీని వల్లే వారి మధ్య సఖ్యత పెరుగుతుంది. దీని వల్ల రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతుంది.భర్తగా మీరు శృంగారాన్ని కోరుకోవడంలో తప్పే లేదు. కానీ, మీ భార్య అందుకు ఎందుకు ఒప్పుకోట్లేదో అర్థం చేసుకోండి. దీని గురించి ఓపెన్‌గానే మాట్లాడండి. ఎందుకు అవాయిడ్ చేస్తుందో అడగండి.
కొంతమంది మహిళలు రొమాన్స్ చేయకపోవడానికి ఒప్పుకోక పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే, స్ట్రెస్, హార్మోనల్ చేంజెస్, మీ సంసారంలో గొడవలు, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. మీ భార్య ఇందులో ఏ సమస్యతోనైనా బాధపడుతుందో కనుక్కోండి. ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోండి.తనకి ఇందులో ఎలాంటి సమస్యలు లేకపోతే మీ అవసరాలు, కోరికల గురించి తనకి క్లియర్ చెప్పండి. శృంగారం గురించి ఒప్పుకోకపోతే మీరు ఎంత బాధపడుతున్నారో చెప్పండి. తనని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ రిలేషన్‌లో అయినా మ్యూచ్యువల్ అండర్‌స్టాండింగ్ చాలా ముఖ్యం. ఇది తనకి అర్థమయ్యేలా చెప్పండి. దీని వల్ల ఆరోగ్యకరమైన రిలేషన్‌షిప్ పెరుగుతుంది.