LED TV Free On LG G8X ThinQ: ఎల్‌జీ బంపరాఫర్, మొబైల్ కొంటే టీవీ ఉచితం, LG G8X ThinQపై ఆఫర్ ప్రకటించిన కంపెనీ, జూన్ 15 వరకు అందుబాటులో..,స్మార్ట్‌ఫోన్ ధర రూ.49 వేల 999
న్యూ ఇయర్, పండుగ సీజన్ వస్తుండడంతో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు,(Discounts) ఆఫర్లు (Offers) ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఎల్‌జీ(LG) కంపెనీ తమ సెల్ ఫోన్ కొంటే టీవీ ఫ్రీగా(LED TV Free On LG G8X ThinQ) తీసుకపోవచ్చని వెల్లడిస్తోంది. ఈ ఫోన్ ద్వారా వినియోగదారులకు టీవీని ఉచితంగానే డెలివరీ చేస్తామని ఆ కంపెనీ ప్రకటిస్తోంది.
New Delhi, December 28: న్యూ ఇయర్, పండుగ సీజన్ వస్తుండడంతో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు,(Discounts) ఆఫర్లు (Offers) ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఎల్‌జీ(LG) కంపెనీ తమ సెల్ ఫోన్ కొంటే టీవీ ఫ్రీగా(LED TV Free On LG G8X ThinQ) తీసుకపోవచ్చని వెల్లడిస్తోంది. ఈ ఫోన్ ద్వారా వినియోగదారులకు టీవీని ఉచితంగానే డెలివరీ చేస్తామని ఆ కంపెనీ ప్రకటిస్తోంది.
వన్ టైం ఫ్రీ స్ర్కీన్ రీ ప్లేస్ మెంట్ కూడా అందిస్తోంది. కాగా కంపెనీ ఇటీవలే ఇండియాలో LG G8X ThinQ లాంచ్ చేసింది. దీని ధర రూ. 49 వేల 999గా ఉంది. ఈ సెల్ ఫోన్ కొంటే 24 ఇంచుల LG LED TV ఉచితంగానే అందిస్తామని కంపెనీ ప్రకటించింది. 2020, జనవరి 15 వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది.
ఆన్ లైన్ ద్వారా కానీ..ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఎల్ జీ 8 ఎక్స్ థిన్ క్యూ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులు అమెజాన్ లేదా ఆఫ్ లైన్ స్టోర్ లో కొనుక్కొన్నాక.. జనవరి 15 తేదీలోపు.. ఎల్ జీ వెబ్ సైట్ లో పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, దాని IMEI నంబర్, సీరియల్ నంబర్ తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుందని వెల్లడించింది. ఫ్రీగానే డెలివరీ అవుతుందని, ఈ ఫోన్ కొనుగోలుపై ఉచితంగా అందిస్తున్న టీవీ ఖరీదు రూ. 10 వేల 990గా ఉందని కంపెనీ తెలిపింది.
(The above story first appeared on LatestLY on Dec 28, 2019 02:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

