Mumbai Fire Accident: ముంబైలో ఘోరం.. షార్ట్ సర్క్యూట్ తో భవనంలో మంటలు.. ఏడుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు (వీడియో)
ముంబైలో ఘోరం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి చెంబూరు ప్రాంతంలోని ఓ ఇల్లు ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
Mumbai, Oct 6: ముంబైలో (Mumbai) ఘోరం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి (Mumbai Fire Accident) చెంబూరు ప్రాంతంలోని ఓ ఇల్లు ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
Here's Video:
#WATCH | Mumbai, Maharashtra | 7 people including 3 children died after a fire broke out at a shop in Chembur around 5 am today: BMC pic.twitter.com/Q87SN0Pgdo
— ANI (@ANI) October 6, 2024
ఎలా జరిగిందంటే?
రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అవి వేగంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయి. దీంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
(The above story first appeared on LatestLY on Oct 06, 2024 11:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

