Dog Ran Away with Mic: రిపోర్టర్ మైక్రోఫోన్‌ను నోట కరుచుకుని కుక్క పరుగు, దాని వెనకాలే పరిగెత్తిన రిపోర్టర్, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో, ట్విట్టర్లో సరదా కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో నవ్వుల్ని పూయిస్తోంది. రిపోర్టర్ లైవులో పీటూసీ ఇస్తుండగా ఓ కుక్క రిపోర్టర్ దగ్గర నుంచి మైకు లాక్కుని (Dog Ran Away with Mic) పరారరయింది. ఈ ఆసక్తికర ఘటన రష్యాలో జరిగింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో నవ్వుల్ని పూయిస్తోంది. రిపోర్టర్ లైవులో పీటూసీ ఇస్తుండగా ఓ కుక్క రిపోర్టర్ దగ్గర నుంచి మైకు లాక్కుని (Dog Ran Away with Mic) పరారరయింది. ఈ ఆసక్తికర ఘటన రష్యాలో జరిగింది.
వైరల్ వీడియో వివరాల్లోకెళితే.. రష్యాలో మాస్కో నగరంలో ఉన్న ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ నడేజ్డా సెరెజ్కినా వాతావరణం మీద లైవ్ (Live Weather Broadcast ) ఇస్తున్నారు. ఈమె లైవ్ ఇస్తుండగా ఓ చిలిపి కుక్క రిపోర్టర్ మైక్రోఫోన్‌ను ఎత్తుకుని పరుగు లంకించుకుంది.ఆ కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ,ఆమెపైకి అమాంతం ఎగిరి ఆమె చేతిలోని మైక్రోఫోన్‌ను నోట కరుచుకుని పరుగు లంకించుకుంది.
కుక్కను పట్టుకునేందుకు రిపోర్టర్ నడేజ్డా కూడా లైవ్ లోనే కుక్క వెంట పరిగెత్తింది. చివరకు కుక్కును పట్టుకున్న రిపోర్టర్.. దాని నోట్లో ఉన్న మైక్రోఫోన్‌ను తిరిగి సాధించింది. కాగా లైవ్ వార్తలను చూస్తున్న వారంతా.. మైక్రోఫోన్‌ను కుక్క నోట కరుచుకోవడం.. మైక్రోఫోన్ కోసం రిపోర్టర్ కుక్క వెంట పరిగెత్తడం చూసి నవ్వుకున్నారు. లైవ్‌లో కుక్క ఎపిసోడ్ మధ్యలో రావడంతో యాంకర్ ఎలినా డాష్కువా వెంటనే తేరుకుని వాతావరణం వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.
Here's Viral Video
A dog in Russia grabbed the reporter's microphone and ran away during a live broadcast pic.twitter.com/R1T8VZ5Kpt
— Ali Özkök (@Ozkok_A) April 2, 2021
Any video about that ? 🥺
— sam (@BodinSamuel) April 2, 2021
కాగా ఈ వీడియోను అలీ ఓజ్కోక్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో నవ్వుల్ని పూయిస్తోంది. కాగా మైక్‌పై కుక్క దంతాల గుర్తులు ఉన్నట్లు టీవీ ఛానల్ సిబ్బంది గుర్తించారు.ఈ వీడియో ట్విటర్‌లో వైరల్ (Viral Video) కావడంతో నెటిజెన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రష్యాలో కుక్కలు ఇంటర్వ్యూ చేస్తాయి.. రిపోర్టర్ అని కుక్కకు బహుషా తెలిసి ఉండదు.. అంటూ నెటిజెన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Apr 03, 2021 04:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

