Allu Arjun: మరోసారి తన విశిష్టతను చాటుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 10 కోట్లు ఇస్తామన్నా ఆ పని చేయలేదు. ఏంటా విషయం?
తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటూ అల్లు అర్జున్‌కు ఓ కంపెనీ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం ఇస్తామని ఆఫర్ చేసిందట. అయినప్పటికీ, ఈ అల్లు హీరో ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. కారణం ఆ కంపెనీ గుట్కా, లిక్కర్ వ్యాపారానికి సంబంధించింది కావడమే.
Hyderabad, August 11: సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు (Commercial Ads) హీరో, హీరోయిన్లకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతాయన్న విషయం తెలిసిందే. పుష్ప (Pushpa) హిట్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ (Alluarjun).. ఒక్కో యాడ్‌కు రూ.7.5 కోట్లు తీసుకుంటాడని సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఓ కంపెనీ తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటూ అల్లు అర్జున్‌కు ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం ఇస్తామని ఆఫర్ (Offer) చేసిందట. అయినప్పటికీ, ఈ అల్లు హీరో ఆ ఆఫర్ ను తిరస్కరించాడని తెలుస్తున్నది.
‘మై సూపర్ ఫ్యాన్స్..’ అంటూ సూపర్ స్టార్ మహేష్ ఎమోషనల్ పోస్ట్.. ఎందుకంటే..
కారణం ఏంటో తెలుసా? ఆ యాడ్ కావాలని అడిగింది గుట్కా (Gutka) అండ్ లిక్కర్ (Liquor) కంపెనీ కావడమే! జనాలకు హాని చేసే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యం లేని పుష్పరాజ్ ఆ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐకాన్ స్టార్ (Iconstar) నిర్ణయాన్ని ఫ్యాన్స్ తో పటు సినీప్రియులు అభినందిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 11, 2022 12:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

