సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (MaheshBabu) మంగళవారంతో 47వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌, సన్నిహితులు, మిత్రులు చూపించిన ప్రేమకు మహేశ్‌ ఫిదా అయ్యాడు. బర్త్‌ డే వేడుకలు ముగిసిన అనంతరం మహేశ్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ప్రియమైన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా సూపర్ ఫ్యాన్స్.. మీ విషెస్‌కు థాంక్యూ. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. గత ఏడాది చాలా బాగా గడిచింది. ఇక ముందు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాను’ అంటూ తన బర్త్ డే విషెస్‌పై స్పందించాడు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)