సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ మసాలా చిత్రం గుంటూరు కారం. ఇందులో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కాగా, గుంటూరు కారం చిత్రం నుంచి తొలి సింగిల్ నేడు విడుదలైంది. దమ్ మసాలా అంటూ సాగే ఈ గీతం లిరికల్ వీడియో చూస్తే... పూర్తిగా మహేశ్ బాబు హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా సాగుతుంది. ఈ చిత్రం నుంచి రిలీజైన తొలి పాట ఇదే. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. తమన్ సంగీతం, రామజోగయ్య పద చమత్కారం పాటను మరోస్థాయిలో నిలిపాయి. దమ్ మసాలా సాంగ్ వీడియోను మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు.

Here's Video Song

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)