సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారువారి పాట‌. గీతా గోవిందం ఫేం పరుశురాం పెట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ , 14 రీల్స్ సంస్థ‌ల‌తో క‌లిసి మ‌హేష్‌బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. కీర్తీసురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.మేక‌ర్స్ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో మ‌హేష్‌బాబు మాస్ అవ‌తారంలో క‌నిపిస్తున్నాడు. అంతేకాకుండా మ‌హేష్‌బాబు ఒక భారీ యాక్ష‌న్ ఫైట్‌ను చేస్తున్న‌ట్లు ఈ పోస్ట‌ర్‌లో ఉంది. ఇప్ప‌టికే చిత్ర బృందం విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు, టీజ‌ర్ గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన క‌ళావ‌తి పాట యూట్యుబ్‌లో 5.5 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డుల‌ను సృష్టిస్తుంది. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)