BigBoss6: మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెల నుంచే?.. అంతవరకూ లోగో, తాజా టీజర్ ను చూసేయండి..
BiggBoss6 (Image Credits: StarMaa)

Hyderabad, August 5: తెలుగు రియాలిటీ షోలల్లో కొత్త ఒరవడిని సృష్టించిన కార్యక్రమం ‘బిగ్‌బాస్‌’ (Biggboss). వివిధ భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో.. తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నది. ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఆరో సీజన్‌ లోగో ను స్టార్ మా (Star Maa) ఛానల్ తాజాగా విడుదల చేసింది. ఈసారి కూడా కింగ్‌ నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. గతంలో వచ్చిన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఓటీటీలో (OTT) స్ట్రీమింగ్‌ అవగా ఈ ఆరో సీజన్‌ మాత్రం టీవీలోనే ప్రసారం కానుంది.

వీర్యం లేకుండానే పిండం అభివృద్ధి.. ఇజ్రాయెల్‌ పరిశోధకుల ఘనత.. సంతానం లేని దంపతులకు భవిష్యత్తులో గొప్ప ఊరట

సెప్టెంబర్‌ మొదటి లేదా రెండో వారంలో ఈ సీజన్‌ ప్రారంభమయ్యే సూచనలున్నాయి. ఈ  షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఈసారి షోలో కొత్త మలుపులు ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే!