Jerusalem, ఆగస్టు 5: వీర్యకణాలతో (Sperm) పనిలేకుండా సింథటిక్ పిండాన్ని (Embryo) ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ప్రపంచంలో ఈ తరహా ఆవిష్కరణ ఇదే తొలిసారి. రాతి పాత్రలో స్టెమ్ సెల్స్ ఉపయోగించి ఈ పిండాన్ని అభివృద్ధి చేయడం విశేషం. ఎలుకల (Mouse) పిండాలను నమూనాగా తీసుకొని, 8.5 రోజుల పాటు లోతైన పరిశోధనలు చేసి ఈ పిండాన్ని వృద్ధి చేసినట్టు పరిశోధకులు తెలిపారు.
భూమిని పోలిన మరో గ్రహం గుర్తింపు.. మన గ్రహానికి 37 కాంతి సంవత్సరాల దూరంలో..
సంతాన సమస్యలతో బాధపడే దంపతులకు తమ ఆవిష్కరణ ఒక ఆధారంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై మరింత పరిశోధనలు (Research) చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు.